విజయవాడ

మహిళల భద్రతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 16: సమాజంలో మహిళలకు భద్రతే లక్ష్యంగా శక్తి బృందాలు పని చేయాలని క్రైం డీసీపీ బీ రాజకుమారి అన్నారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కృషి చేయాలన్నారు. పోలీసుశాఖ పరంగా మహిళలకు మెరుగైన సేవలందించే చర్యల్లో భాగంగా మహిళా శక్తి బృందాలకు డీసీపీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనరేట్‌లోని సిటీ స్పెషల్ బ్రాంచి కాన్ఫరెన్స్ హాలులో శనివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శక్తిబృందాలనుద్దేశించి డీసీపీ రాజకుమారి మాట్లాడారు. మహిళలకు అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ చొరవతో పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నేతృత్వంలో గత ఏడాది డిసెంబర్ 17న కమిషనరేట్‌లో శక్తిబృందాలను ఏర్పాటు చేసిన తొలి పైలట్ ప్రాజెక్టు కింద నగరంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడంతోపాటు ముఖ్యంగా మహిళలకు, యువతులు, విద్యార్థులకు భద్రతా భావాన్ని పెంపొందించడమే శక్తిబృందాల ప్రధాన ఉద్దేశమని రాజకుమారి అన్నారు. మహిళల సామాజిక సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సహాయ సమాచారం తదితర అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు సేవలందించడంతోపాటు వారికి చేరువ కావడానికి శాఖాపరంగా అనుసరించాల్సిన విధానాలు, పనితీరు, ప్రగతిపై డీసీపీ శక్తి బృందాలతో సమీక్షించారు. గస్తీ నిర్వహణ, మహిళల్లో చైతన్యం తీసుకురావడం, విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, మహిళా చట్టాలు వాటి గూర్చి వివరించారు.