విజయవాడ

ఏఈఈ పరీక్షకు 3, 832 మంది హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌చే నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షలకు 3832 మంది అభ్యర్ధులు హాజరయ్యారని, పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అన్నారు. నగరంలోని నలంద డిగ్రీ కళాశాలలో జరిగిన పరీక్ష కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపిపిఎస్‌సి ఏఇ పరీక్ష నిర్వహణకు నగరంలో 15 కేంద్రాలు ఏర్పాటు చేశామని దీనికి 5610 మంది అభ్యర్ధులు హాజరు కావాల్సీ ఉండగా 3832 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 68.31 శాతం హాజరు నమోదైందన్నారు. పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు.

ఎర్రకట్టపై నెర్రలో ఇరుక్కుపోయిన ఒంటె
*ట్రాఫిక్ సీఐ చొరవతో బయటపడిన వైనం
పాతబస్తీ, ఫిబ్రవరి 17: నగరంలో ఇటీవల సంచరిస్తున్న ఒంటెల్లో ఒకటి ఆదివారం కేదారేశ్వరపేట ఎర్రకట్ట సమీపంలోని రైల్వేబ్రిడ్జి రోడ్డు సందుల్లో కాలుపడి ఇరుక్కుపోయింది. బాధతో విలవిల్లాడుతున్న ఒంటె ట్రాఫిక్ సీఐ దుర్గారావు చొరవతో బయటపడింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. రాజస్తాన్ నుండి వచ్చిన సుమా రు 10 కుటుంబాలు తమ వెంట ఒంటెలను తీసుకొచ్చాయి. నగరంలోని ప్రధాన వీధుల్లో చిన్నారులను ఎక్కించి ఒంటె సవారీ చేయించి జీవనం సాగిస్తున్నారు. రూ. 30లు వసూలు చేసి చి న్నారులను ఉల్లాస పరుస్తున్నారు. ఆ క్రమంలో మ్యాంగో మార్కెట్ ప్రాం తం నుండి సితార సెంటర్‌కి ఎర్రకట్ట మీదుగా వస్తున్నారు. కేదారేశ్వరపేట ప్రాంతంలోని రైల్వేబ్రిడ్జి బ్లాకుల మధ్య సిమెంట్ తారు నామరూపాలు లేకుం డా పోయి పెద్దపెద్ద నెర్రులిచ్చాయి. ఒం టెలు ఆ మార్గంలో నడుస్తుండగా ప్ర మాదవశాత్తు ఒకదాని కాలు ఆ నెర్రిలో పడింది. అంతే ఆ బాధకు తట్టుకోలేని ఒంటె విలవిల్లాడింది. అది గమనించిన ట్రాఫిక్ సీఐ దుర్గారావు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ని మళ్లించారు. పొక్లెయిన్‌ను రప్పించి దాని సాయంతో రోడ్డును వెడల్పుగా గాడి చేయించి ఒంటె కాలును బయటకు తీయించారు. వెంటనే తారు, సిమెంట్‌ను తెప్పించి ఆ నెర్రిని పూడ్చారు. నాలుగు గంటల పాటు వాహనాలను దారి మళ్లించారు. కేవలం ద్విచక్ర వాహనాలనే అనుమతించారు. పోలీసుల చొరవను స్థానికులు ప్రశంసించారు.