విజయవాడ

చంద్రబాబు వస్తే సంక్షేమం..జగన్ గెలిస్తే శ్మశానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: ప్రతిపక్ష నేత జగన్ ఏనాడూ లేని విధంగా, మ నస్సాక్షికి విరుద్ధంగా బీసీల సంక్షేమం గురించి మాట్లాడటం, బీసీ గర్జన పేరుతో నోటికొచ్చినట్లుగా హామీలు ఇవ్వడం, సవతితల్లి ప్రేమ కనపర్చడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శాసనమండలిలో ప్రభు త్వ విప్ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రతిపక్ష నేత కు బీసీలు గుర్తొస్తారని, ఏదోరకంగా వారి ఓట్లు రాబట్టుకోవాలనే దురుద్దేశ్యంతో నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చే సి, అనంతరం మర్చిపోవడం జగన్‌కు పరిపాటిగా మారిందన్నారు. బీసీల వి షయంలో జగన్ వైఖరి ‘ఏరుదాటాక బోడిమల్లన్న’ అన్నట్లుగా ఉందని వెం కన్న మండిపడ్డారు. చంద్రబాబు మ రలా ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం లో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతాయనే ధృడ విశ్వాసం రాష్ట్ర ప్రజల్లో ఉందని, అదే సమయంలో జగన్ వస్తే రాష్ట్రం శ్మశానం అవుతుందన్న భయం కూడా వారిని వెంటాడుతోందన్నారు. అన్ని విషయాల్లో పక్క రాష్ట్రాన్ని మెచ్చుకునే జగన్‌కు ఆ రాష్ట్రంలో 26కులాలను బీసీ జాబితాలో నుంచి తొలగించిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. పరాయి రాష్ట్రంలోని పరాన్నభుక్కుల పంచన చేరిన జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ, కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని బుద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో దారపనేని చంద్రశేఖర్, కోగంటి రామారావు, పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్ లుక్కా సాయిరాంప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.

14వ రోజుకు చేరిన జనంలోకి జనసేన
పాతబస్తీ, ఫిబ్రవరి 18: ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి తీ రాలి కొండ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కృష్ణాజిల్లా జనసేన పార్టీ నాయకులు, స్పీకర్ ప్యానల్ సభ్యులు పోతిన వెంకట మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనంలోకి జనసేన 14వ రోజు నాలుగు స్తంభాలు సెంటర్ వద్ద కాకతీయ కళాకారుల బృందం చేత పవన్ కళ్యాణ్ భావజాలాన్ని మేనిఫెస్టోలో అంశాలు వారి ఆటపాట చేత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ పేదల పక్షపాతి అని ఉచిత గ్యాస్ సరఫరా పథకం, నగద బదిలీ పథకం ఈ రెండు అంశాలకు ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీ రామకృష్ణ, ఎల్ కనకరాజు, జీ రామనుజమ్మ, కే జగదాంబ, కార్తీక్, రాజునాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్ జిమ్‌కు మేయర్ శంకుస్థాపన
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 18: 54వ డివిజన్ అజిత్‌సింగ్‌నగర్‌లోని ఆర్‌సీఎం చర్చి వద్ద ఖాళీ స్థలం లో ఓపెన్ జిమ్ నిర్మాణానికి మేయర్ కోనేరు శ్రీ్ధర్ సోమవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.40లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ జిమ్‌లో పిల్లల ఆట పరికరాలు, పెద్దల వ్యాయామానికి అవసరమైన పరికరాలతోపాటు వాకింగ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. అనంతరం మేయర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ నగర ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి వీఎంసీ విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రోడ్లు, మంచినీటి సరఫరా, మురుగు పారుదలతోపాటు వ్యాయామ శాలలు, పార్కులను కూడా పెద్ద ఎత్తును అభివృద్ధి పర్చుతున్నామని తెలిపిన ఆయన ప్రజలు ఆయా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని హితవుపలికారు. గ్రౌండ్‌లో అనధికారికంగా కార్లను పార్కింగ్ చేసిన వైనాన్ని గుర్తించిన మేయర్ తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు. తదుపరి స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన కేంద్రం భవనంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవనం గ్రౌండ్ కంటే తక్కువగా ఉండటం, గోడలు, శ్లాబ్ పెచ్చులూడి ప్రమాదకరంగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ కరీమున్నీసా, రుహుల్లా, ఈఈ వౌసిమి గానియా పాల్గొన్నారు.