విజయవాడ

జనసేన అభ్యర్థిత్వం కోరుతూ 275 దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 18: జసనేన పార్టీ తరుపున అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం కోరుతూ పెద్ద ఎత్తున తమ బయోడేటాలను పార్టీ స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థులు అందిస్తున్నారు. నగరంలోని గాయత్రీనగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఒ క్కరోజే 275 దరఖాస్తులను అభ్యర్థు లు స్క్రీనింగ్ కమిటీకి అందించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుం డి జనసేన పార్టీ అభ్యర్థిత్వం కోరుతూ మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి సో మవారం అందించారు. ఈసందర్భం గా రావెల మాట్లాడుతూ పార్టీ అధ్యక్షు డు పవన్ చూపించిన దారిలోనే తా ము కూడా స్క్రీనింగ్ కమిటీకి బయోడేటాను సమర్పించామన్నారు. విశ్రాంతి ఐపీఎస్ అధికారి టి రవి కుమార్ కూ డా తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి అందించారు. బయోడేటాలను అందించిన వారిలో విశ్రాంత ఉద్యోగు లు, సీనియర్ జర్నలిస్టులు, గిరిజనులు ఎక్కువుగా ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధిం చి జనసేన పార్టీ తరుపున పోటీ చేసేందుకు గిరిపుత్రులు ఎక్కువుగా ఆసక్తి చూపించారు. గిరిజన సంక్షేమానికి జ నసేన అండగా ఉంటుందని, అధికారంలోకి వస్తే బాక్సైట్ త్వకాలు నిలిపివేస్తామని పవన్ ప్రకటించడంతోనే జనసేన పార్టీని గిరిపుత్రులు నమ్ముతున్నారని అభ్యర్థులు చెబుతున్నారు. గిరిజనులపై నిజమైన ప్రేమ పవన్‌కు మా త్రమే రాష్ట్రంలో ఉందంటున్నారు. 5రోజుల్లో స్క్రీనింగ్ కమిటీ ముందుకు ప లువురు అడబిడ్డలు తరలి వచ్చి రిజ ర్వ్డ్ స్థానాల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు. సో మవారం స్క్రీనింగ్ కమిటీ ముందుకు 45 బయోడేటాలను గిరిపుత్రులు అం దించారు. తమ వద్దకు వచ్చిన బయోడేటాలను స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్కొక్క దరఖాస్తును సునిశితంగా పరిశీలిస్తున్నారు.