విజయవాడ

పునరావాసులకు పక్కాగృహాల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 18: నగరంలోని వివిధ ప్రాంతాలలో తొలగించిన ఇళ్లకు సంబంధించి వారికి పక్కాగృహాలను కేటాయించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో సింగ్‌నగర్‌లో నిర్మించిన జీ ప్లస్ త్రీ పక్కాగృహాలను సోమవారం ఉదయం కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశంలో లబ్ధిదారుల వాటా కింద రూ.66 వేలు చెల్లించిన వారితోనే తమ ఇళ్లకు సంబంధించి లాటరీ తీయించి కేటాయించారు. ఈసందర్భంగా కమిషనర్ జే నివాస్ మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న వారికి గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించడం జరుగుతుందని, లబ్ధిదారులు తమ ధ్రువీకరణ సర్ట్ఫికెట్‌ను అందజేయాలన్నారు. కేటాయింపు ప్రక్రియ పారదర్శకతో ఉండాలన్న ఉద్దేశంతో లబ్ధిదారుల సమక్షంలో వారితోనే లాటరీ తీయిస్తున్నట్టు తెలిపారు. ఎంపిక కాబడి ప్లాట్‌ను త్వరలోనే అప్పగించడం జరుగుతుందన్నారు. మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు శాశ్వత, సురక్షిత గృహాలను అందించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు కాల్వగట్ల నివాసులకు అన్ని వసతులతో కూడిన గృహాలను అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం కేటాయించిన గృహాలను సత్వరమే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి చేయించుకుంటే పూర్తి హక్కులు పొందుతారన్నారు. గృహాలు పొందిన వారు తమ గృహాలను విక్రయించకుండా జీవితాంతం ఉంచుకోవాలని హితవుపలికారు. ఈకార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, ఈఈ మోహనరావు, డీఈఈ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

బీసీలను నమ్మించి మోసగిస్తున్న టీడీపీ
*వైసీపీ నేతలు కొలుసు, మోపిదేవి
విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 18: బీసీల జీవనప్రమాణాలు పెంచి వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వారిని ఆదుకుంటామని ఎన్నికల సమయం లో మాయమాటలు చెప్పి చంద్రబాబు బీసీలను నమ్మించి మోసం చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొలుసు పా ర్థసారథి, మోపిదేవి వెంకటరమణలు విమర్శించారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీల జీవితాల్లో మార్పు రాలంటే అది కేవలం జగన్‌తోనే సాధ్యమన్నారు. బీసీల సమస్యలపై స్పందించడమే కాకుండా, బీసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. బీసీ గర్జనకు తలసాని సహాయం పొందారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణా నుండి బీసీ గర్జనకు వచ్చారని విషప్రచారం చేస్తున్నారని తెలిపారు. బీసీలను అవమానించేలా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకే ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని జగన్ ప్రకటించడం బీసీల పట్ల ఆయనకు ఉన్న సానుకూల దృక్ఫదాన్ని తెలియజేస్తుందన్నారు. బీసీల అభివృద్ధి వైఎస్ హయాంలోనా, బాబు పాలనలోనే అనే అంశంపై చర్చకు సవాల్ విసిరిన అచ్చెన్నాయుడు సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణాలో 32 బీసీ కులాలను తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం
అంతకముందు పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైసీపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. బీసీ గర్జనలో బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు చెబుతూ వైఎస్ విగ్రహానికి పూలు, పసుపు కుంకుమలతో పాలభిషేకం చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతనలు నేతలు, కార్యకర్తలు తెలిపారు.