విజయవాడ

ఢిల్లీ సీఎంకు సాదర స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు రా ష్ట్రానికి వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఘన స్వాగతం ల భించింది. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న కేజ్రీవాల్ కు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. వి మానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో మంత్రి దేవినేనితో కలిసి కేజ్రీవాల్ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నా రు. తరువాత గేట్‌వే హోటల్ నుండి బయలు దేరిన మంత్రి దేవినేని కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఉండవల్లి తీసుకుని వెళ్లారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్వాగతం పలికిన వారిలో జేసీ కృతికా శుక్లా, సబ్ కలెక్టర్ మిషా సింగ్ తదిరతులున్నారు.

ఇవిఎంలు, వివిప్యాట్‌లపై
అవగాహన పెంచుకోవాలి
*సబ్ కలెక్టర్ మిషాసింగ్
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 18: రానున్న సాధారణ ఎన్నికల్లో ఇవిఎంలు, వివిప్యాట్‌లపై ఎన్నికల అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహనతోపాటు సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించుకునేలా సిద్ధంగా ఉండాలని సబ్‌కలెక్టర్ మిషాసింగ్ బూత్‌స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లకు సూచించారు. పారదర్శకతతో ఎన్నికల ప్రక్రియను నిర్వహించేవిధంగా ఇవిఎంలు, వివి ప్యాట్‌లపై సోమవారం విజయవాడ డివిజన్ పరిధిలోని పెనమలూరు, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బిఎల్‌ఓలు, సూపర్‌వైజర్లకు సబ్‌కలెక్టర్ మిషాసింగ్ అవగాహనతో కూడిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న సాధారణ సార్వత్రిక ఎన్నికలను సాంకేతికంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఇప్పటి నుంచే బూత్‌స్ధాయి అధికారులకు, సూపర్‌వైజర్లకు ఇవిఎం, వివి ప్యాట్‌లపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రజలకు, రాజకీయ పక్షాలకు ఉన్న అపోహలను నివృత్తి చేసేలా బూత్‌స్ధాయిలో అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా వివి ప్యాట్‌లను ప్రవేశపెడుతున్నామని, వీటి ద్వారా ఓటరు తాను ఎవరికి ఓటు వేసింది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని, ఏడు సెకండ్లపాటు వివి ప్యాట్ మిషన్లపై ఓటు వేసిన అభ్యర్ధి పేరు, సీరియల్ నెంబరు, గుర్తు కనపడుతుందన్నారు.
* తప్పులు లేని ఖచ్చితమైన ఎలక్ట్రోరల్ లోల్స్ సిద్ధం చేయండి
విజయవాడ డివిజన్ పరిధిలోని పెనమలూరు నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా బూత్ స్ధాయి అధికారులు, విఆర్‌ఓలతో కూడిన రెవిన్యూ బృందం ఇంటింటికి వెళ్లి తప్పులను సరి చూసుకుని ఖచ్చితమైన జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఎలక్ట్రోరల్ రోల్స్‌లో తప్పులు గుర్తిస్తే సంబంధిత బూత్ స్ధాయి అధికారిపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ రూరల్ డిప్యూటీ తహశీల్దారు పి వైకుంఠరావు, బెల్ ఇంజనీర్లు ఏ కార్తిక్, మానిష్‌కుమార్‌లు మాస్టర్ ట్రైనర్స్‌గా ఇవిఎంలు, వివిప్యాట్‌లపై బూత్ స్ధాయి అధికారులు, సూపర్‌వైజర్లకు అవగాహనతో కూడిన సాంకేతిక శిక్షణను అందించారు.