విజయవాడ

కమిషనరేట్‌కు ‘క్రైంస్పాట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 18: ఆధునిక, సాంకేతిక పరిఙ్ఞనాన్ని రోజురోజుకు నగర పోలీసు కమిషనరేట్ అందిపుచ్చుకుంటోంది. ప్రజలతో నిత్యం మమేకమవుతూ ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ను విజయవంతంగా అమలు చేస్తున్న నగర పోలీసుశాఖ మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటి అంశాల్లో అంతే వ్యవస్థీకృత విధానాలను అనుసరిస్తోంది. ఇందుకోసం సాంకేతిక పరిఙ్ఞనాన్ని వినియోగించుకుంటోంది. దీనిలో భాగంగా నేరాలను కట్టడి చేసే క్రమంలో కమిషనరేట్‌కు కొత్తగా ఆరు ‘క్రైం స్పాట్’ వాహనాలు సమకూరాయి. రాష్ట్ర పోలీసుశాఖ ఆధ్వర్యాన కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కొత్త వాహనాలను రాష్టవ్య్రాప్తంగా ప్రారంభించారు. ఈ కొత్త వాహనాలను సోమవారం కమిషనర్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు లాంఛనంగా ప్రారంభించారు. కేసులను సులువుగా చేధించేందుకు, నేర స్థలిలో భౌతిక సాక్ష్యాధారాల సంరక్షణ, సేకరణలో మరో ముందడుగు వేసేందుకు ఈ వాహనాలు కీలకపాత్ర వహించనున్నట్లు పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఈసందర్భంగా పేర్కొన్నారు. ఈ క్రైమ్ స్పాట్ వాహనాలు కమిషనరేట్‌లోని ప్రతి సబ్ డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాలు నేరం జరిగిన ప్రదేశానికి చేరుకుంటాయి. వీటిలో ఉండే క్లూస్ బృందాలు లైవ్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పర్యవేక్షణ చేసి ఆన్‌లైన్‌లో సిబ్బంది గైడెన్స్ ఇవ్వడం ద్వారా నేరానికి సంబంధించిన ఆధారాలు త్వరతిగతిన సేకరించి కేసు చేధించి నేరగాళ్లను గుర్తించడంలో దోహదపడతాయని సీపీ చెప్పారు. నేరస్ధలిలో భౌతిక సాక్ష్యాలు విశే్లషించడం, నిర్థారించడం, సేకరిచడం, వివిధ రకాల పరికరాలతో కూడిన కిట్‌లను, వీడియో, ఫొటో కెమేరాలు, యువి లైట్స్, నార్కొటిక్, ఎక్స్‌ప్లోజివ్ డిటెక్టర్ వంటి సాంకేతిక పరికరాలు అమర్చారు. ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ బృందానికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రైం డీసీపీ బి రాజకుమారి, డిసీపీలు వెంకట అప్పలనాయుడు, హర్షవర్ధన్ రాజ్, ఉదయరాణి, కోటేశ్వరరావు, అదనపు డీసీపీలు చంద్రశేఖర్, షేక్ నవాబ్‌జాన్ ( లా అండ్ ఆర్డర్) , నాగరాజు (ట్రాఫిక్ ), ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.