విజయవాడ

మనోనిశ్చలతకు నాంది మాఘపౌర్ణమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 19: మనోనిశ్చలతకు నాంది మాఘపౌర్ణమి అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వర శర్మ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎదురుగా ఉన్న శ్రీ విజయేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో 40వ అరుణ పారాయణమహోత్సవాలు సందర్భంగా మంగళవారం మాఘ పౌర్ణమి సందర్భంగా కలియుగ ప్రత్యేక దైవం శ్రీ సూర్యనారాయణ మూర్తికి విశేషార్చనలు జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వర శర్మ మాట్లాడుతూ పౌర్ణమి చంద్ర సంబంధమైన తిధి అని, చంద్రుడు మనస్సుకు అధిపతి అని చంద్ర గ్రహ అనుగ్రహంతోమనస్సు నిర్మలంగా ఉంటుందన్నారు. మఖానక్షత్రంమలో పౌర్ణమి వస్తే అది మాఘమాసమన్నారు. మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుందని, ఈ రాశికి అధిపతి రవి అని పసుమర్తి వివరించారు. రవిచంద్రులు ఇద్దరూ మిత్రులని, రవికిరణాలు చంద్రుని మీద పడితే చంద్రుడు ప్రకాశించటం జరుగుతోందన్నారు. మనలో రవిచంద్రులు ఇద్దరూ ఉంటారనీ, హృదయ కారకుడు రవి, మనస్సు కారకుడు చంద్రుడనీ పసుమర్తి పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే అటుపోట్లకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, అటువంటి వారికి ఆత్మ స్ధైర్యాని, మనోధైర్యాన్ని ఇచ్చే మార్గాన్ని చూపించేది మాఘ పౌర్ణమి అని పసుమర్తి భక్తులకు వివరించారు. మంచి చెడుల పుణ్య పాప ఫలితాలను ఈశరీరం ద్వారా అనుభవించటం జరుగుతోందని, ఆ అనుభవం మనస్సుపై పడి తీవ్రమైన సంక్షోభానికి మానవులు గురవుతున్నారని ఈవిధంగానే మంచి చెడుల ప్రభావం సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు మీదపడి, నాడీ స్పందన జరిగి, హృదయ కండరాలు ఒత్తడికీ లోనవుతాయని ఆసమయంలో శరీరం అనారోగ్యానికి గురైవుతోందన్నారు. రోహిణీ, హస్త, శ్రవణం, ఈమూడు చంద్ర నక్షత్రాలని, ఇందులో రోహిణీ వృషభ రాశిలో ఉంటుందని, వృషభరాశి చంద్రునికి ఉచ్ఛరాశి అని ఆయన వివరించారు. ఒకరితోపోల్చుకోకుండా, తనకు ఉన్న దానితో సంతృప్తి పడితే మనోనిశ్చలను పొందుతారని, అప్పుడు జీవితం సుఖమయం, సుసంపన్నం అవుతోందని అన్నారు. అన్నదాత ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణ మూర్తి సౌర తేజస్సు, కాశీ అన్నపూర్ణాదేవి పూర్ణ తత్త్వం రెండు ఒకటేనని అది ఎప్పుడూ పూర్ణమేననీ, ఇదే మాఘ పౌర్ణమిపూర్ణ తత్త్వమని మాఘ పౌర్ణమి విశిష్ఠతను పసుమర్తి వివరించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఆయన వేద అశీస్సులను అందచేసి సూర్యనారాయణమూర్తికి నివేదించిన మహాప్రసాదాన్ని భక్తులకు పెద్ద ఎత్తున్న ఉచితంగా పంపిణీ చేశారు.

జనసేన అభ్యర్థిత్వం కోసం పెరుగుతున్న పోటీ
* బయోడేటా అందించిన యువ క్రికెటర్ వేణుగోపాలరావు
విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 19: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. జనసేన సీటు కావాలని కోరుతూ అన్ని వర్గాల నుండి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా హక్కుల పోరాటయోధులు కూడా ఉంటున్నారు. ఏడు బలమైన సిద్ధాంతాలు కలిగిన జనసేన పట్ల తమకు నమ్మకం ఉందని ఆశావాహులు చెబుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ద్వారానే పాలనలో సమూల మార్పు వస్తుందని విశ్వసిస్తున్నట్లు వారు చెబుతున్నారు. రాజకీయాల్లో అభ్యర్థిత్వం కోసం తమ పేరు పరిశీలించమని కోరేందుకు ఇంత స్వేచ్ఛాయుతమైన వాతారవణం కల్పించిన పార్టీ ఒక్క జనసేన మాత్రమేనని బలంగా నమ్ముతున్నట్లు పలువురు ఆశావాహులు మంగళవారం మీడియాకు తెలిపారు. జనసేన అభ్యర్థిత్వం కోసం వచ్చే వారి నుండి స్క్రీనింగ్ కమిటీ మంగళవారం 150 నుండి దరఖాస్తులను స్వీకరించింది. భారత యువక్రికెటర్ వేణుగోపాలరావు జనసేన పార్టీ తరుపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి అందించారు. మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, జనసేన నేతలు సత్య బొలిశెట్టి, ముత్తం శెట్టి కృష్ణారావులు కూడా వారి బయోడేటాలను సమర్పించారు.