విజయవాడ

వైభవంగా తెప్పోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 19: పవిత్ర కృష్ణానదీలో సాయంత్రం భూదేవి, శ్రీ దేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవిందా గోవిందా అంటూ భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కలియుగ వైకుంఠవాసుని కీర్తిస్తుండగా ఈతెప్పోత్సవం కడు రమణీయంగా జరిగింది. పాతబస్తీ బ్రాహ్మణ వీధీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల దేవస్థానంలో శ్రీ వారి బ్రహోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు దుర్గా ఘాట్‌మవ కూర్చొని శ్రీవారిని స్మరణ చేస్తుండగా పవిత్ర కృష్ణనదీలో శ్రీవారి తెప్పోత్సవం జరిగింది. పాతబస్తీకి చెందిన భక్తులతోపాటు విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాలకుచెందిన భక్తులు మంగళవారం సాయంత్రం 4గంటలకే దుర్గా ఘాట్‌కు చేరుకున్నారు. తొలుత ఒక ప్రత్యేక పంటును వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించి వివిధ రకాలైన విద్యుత్ లైట్లులను అమర్చటంతోపాటు ఒక ప్రత్యేక వేదికను సైతం ఏర్పాటు చేశారు. దేవస్థానం ఈవో ఎస్ హేమలతాదేవి సూచన మేరకు ఆలయ అర్చకులు పాణింగిపల్లి శ్రీరామచంద్రమూర్తి, పరాశరం మురళీకృష్ణచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులను పంట్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వేదికపై ఉంచారు. వందలాది భక్తులు గోవింద గోవింద నామస్మరణ చేస్తుండగా పవిత్ర కృష్ణనదీలో శ్రీవారు శ్రీదేవి, భూదేవి సమేతగా సర్వ అభరణాలను ధరించి నదీ విహారం చేశారు. సంప్రదాయ ప్రకారం మూడు సార్లు శ్రీ వారి ప్రత్యేక వాహానం జల విహారం చేసింది. తొలుత ఆలయం వద్ద నుండి దేవతమూర్తులను ఊరేగింపుగా దుర్గా ఘాట్ వద్దకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీ అధికారి ఎ సుజన్‌కుమార్, దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ కొనగళ్ళ విద్యాధరరావు, వంకదారు వాసుదేవరావు, మాజీ ధర్మకర్తలు అడ్డూరి లక్ష్మణరావు, పొట్నూరి దుర్గా ప్రసాద్,నూకళ్ళ వాసు, తదితరులు పాల్గొన్నారు. ఇందులోభాగంగా ఉదయం అర్చకులు కృష్ణా నదికి వెళ్ళి పవిత్ర జలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి మూల విరాట్‌కు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈవో హేమలతాదేవి దంపతుచేత అర్చకులు పూర్ణాహుతి చేయించారు. రాత్రి 9గంటలకు ధ్వజావరోహణం, ఆశ్వవాహనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి వరకు జరిగి శ్రీవారి కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.