విజయవాడ

దేశ భద్రతలో సైనికుల సేవలు అనిర్వచనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: దేశ రక్షణలో భాగంగా తమ జీవితాలను త్రుణపాయంగా భావించి ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల సేవలను భారతజాతి ఎప్పుడూ మర్చిపోదని వీఐటీ ఏపీ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ డీ శుభాకర్ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా దగ్గర జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన 40మంది సీఆర్పీఎఫ్ జవానులకు వీఐటీ ఏపీ యూనివర్శిటీలో అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థినీ విద్యార్థులు ఘన నివాళి అర్పించారు. ఈసందర్భంగా డా. శుభాకర్ మాట్లాడుతూ మన దేశం కొనే్లళ్లుగా ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతోందని, ప్రపంచ దేశాలు అన్ని కలిస్తేనే ఉగ్రవాదాల్ని కూకటివేళ్లతో పెకిలించవచ్చన్నారు. దీనికోసం అందరూ ఒక్కతాటి పైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దాడిని అందరు ఖండించాలని వీఐటీ ఏపీ రిజిస్ట్రార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్ కోరారు.

అమర జవాన్లకు వ్యాపారుల ఘన నివాళి
* నగర వీధుల్లో భారీ ర్యాలీ

విజయవాడ, ఫిబ్రవరి 19: కాశ్మీర్‌లో జాతీయ రహదారిపై పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళిగా ది విజయవాడ శానిటరీ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం రోడ్డులో ప్రారంభమైన ర్యాలీ డోర్నకల్ రోడ్డు, సివిల్ కోర్టు, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు మీదుగా సాగింది. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బొప్పూడి రామకృష్ణ, కే అనిల్‌కుమార్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగం మరువలేనిదని, జవాన్లపై ఉగ్రవాదుల దాడిని దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. తమ అసోసియేషన్ సభ్యులు సైనిక సంక్షేమ నిధికి విరాళాలు సేకరించి కలెక్టర్ ద్వారా పంపుతున్నట్లు తెలిపారు. జాయింట్ సెక్రటరీ అతుకూరి సురేష్ అధ్యక్షతన జరిగిన శాంతిర్యాలీలో శానిటరీ షాపు యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు.

జవాన్ల మృతికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ
కంకిపాడు, ఫిబ్రవరి 19: కిరాతకమైన ఉగ్రదాడిలో మృతిచెందిన అమర జవాన్లకు నివాళులర్పిస్తూ కంకిపాడు వ్యాపారులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు మంగళవారం ఆర్యవైశ్య కల్యాణ మండపం నుంచి బందరు రోడ్డుపై కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్రంధి రాము మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రతి భారతీయుడు అండగా నిలవాలని కోరారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు ప్రపంచ దేశాలు బుద్ధిచెప్పాలని కోరారు.