విజయవాడ

జేఏసీ నియంతృత్వ ధోరణి సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జేఏసీ రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా, నియంతృత్వ ధోరణితో ఉన్నాయని, దీన్ని తమ సంఘం వ్యతిరేకిస్తోందని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రవాదుల దాడిలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ఆదుకునేందుకు జేఏసీ తరపున రూ. 30కోట్లు ముఖ్యమంత్రికి అందజేయడం చాలా హర్షణీయమని, అయితే ఈ విరాళం అందజేసే ముందు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను కనీసం సంప్రదించకపోవడం సరికాదని ఆక్షేపించారు. ఐఆర్ 20శాతం ఎలా ఒప్పుకున్నారని, ఏవిధమైన పోరాటం లేకుండా ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలకు గండి కొడుతున్నారని సామల ధ్వజమెత్తారు.

బాధ్యతాయుతమైన జర్నలిజం అవసరం
* సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్

విజయవాడ, ఫిబ్రవరి 19: ప్రజలకు బాధ్యతాయుతమైన జర్నలిజం అవసరమని, దానికోసమే ప్రజలు ఎదురుచూస్తున్నారని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ‘న్యూస్ ఆర్బిట్ వెబ్ పోర్టల్’ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజాక్షేమమే తమ లక్ష్యమనే మూలసూత్రంతో పత్రికలు, ఛానల్స్ వస్తున్నా మూలసూత్రాన్ని మాత్రం విస్మరిస్తున్నాయన్నారు. టెక్నాలజీతో జర్నలిజం రంగంలో మార్పులొచ్చాయని, ప్రింట్ మీడియా, టీవీ, వెబ్ ఛానళ్లలో మార్పులు వచ్చాయని, అరచేతిలో ఇమిడిపోయే మొబైల్స్‌లోనూ వార్తలు చూసుకోవచ్చన్నారు. పెట్టుబడిదారులు రంగప్రవేశం చేయడంతో వ్యవస్థ దారిమళ్లిందని, కార్పొరేట్ శక్తులు మీడియా రంగంలో ప్రవేశించాయని తెలిపారు. సీనియర్ ఎడిటర్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరచటంలో, ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడంలో పత్రికలు బాధ్యతగా పనిచేయాలన్నారు. హేతువాద విధానాలకు తిలోదకాలివ్వటం తగదని చెప్పారు. ప్రారంభంలో ‘న్యూస్ ఆర్బిట్’ సంపాదకులు ఆలపాటి సురేష్‌కుమార్ మాట్లాడుతూ నేటి రాజకీయాలను ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉందన్నారు. అమెరికాలో ట్రంప్, రష్యాలో పుతిన్ విజయం సాధించడంలో ఫేస్‌బుక్ పాత్ర అమోఘమైనదన్నారు. కార్యక్రమంలో ఐజేయు ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమసుందర్, ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
నూతన ఆవిష్కరణల దిశగా
టాటా ట్రస్ట్ గ్రోత్ కార్యక్రమం
* యువత నుండి దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, ఫిబ్రవరి 19: యువత పరిశోధనల పట్ల దృష్టి సారించడంతో పాటు నూతన ఆవిష్కరణలు అందించే దిశగా టాటా ట్రస్ట్ కృషి చేస్తోందని ట్రస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్స్ హెడ్ మనోజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖతో పాటు లోక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్, టాటా ట్రస్ట్ సంయుక్తంగా ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయన్నారు. దీనిద్వారా ఇప్పటికే పలు కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. టాటా ట్రస్ట్ మన దేశంలో యువతకు అవకాశాలు కల్పించే దిశగా శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు రోబోటిక్స్, ఆరోగ్య సంరక్షణ, నీరు, శక్తి, లైఫ్ సైన్స్, పౌర సంబంధిత అంశాలు, వౌలిక వసతులు, బయోటెక్నాలజీ, ఆటోమెటివ్, స్పేస్ టెక్నాలజీ సహా కమ్యూనికేషన్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తోందని చెప్పారు. ఓపెన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, యూనివర్శిటీ ఛాలెంజ్‌కు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 21వ తేదీ వరకు సమయం ఉందన్నారు. వీటికి సంబంధించిన ఇతర వివరాలకు టాటా ట్రస్ట్ వెబ్‌సైట్‌లో ఇండియా ఇన్నోవేట్స్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన వివరించారు.

రైతు మృతికి బాధ్యత వహించాలి
కంకిపాడు, ఫిబ్రవరి 19: ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు ద్రోహం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బండి నాంచారయ్య విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో రైతును కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సభకు జరిగిన ఏర్పాట్ల వల్లే పంట నష్టపోయి రైతు చనిపోయాడని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.