విజయవాడ

సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌పై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 20: బ్యాంకర్లు తమ ఖాతాదారులకు సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌పై అవగాహన కల్పించి, వాటిని ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్-2 పీ బాబూరావు అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బ్యాంకర్లు వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య, తదితర కార్పొరేషన్ల అధికారులతో లబ్ధిదారులకు రుణాల మంజూరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలుష్య నివారణ, విద్యుత్ ట్రాన్స్‌మిషన్ నష్టాల నివారణకు సోలార్ విద్యుత్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న విషయాన్ని గుర్తించి వీటి ఏర్పాటుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. నగరంలో 24బ్యాంకులు, రూ.100కోట్ల లోన్ కాంపోనెంట్‌గా మంజూరు చేయాలన్నారు. 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల ఇంటిపై భాగంలో నాలుగు యూనిట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు రూ.60వేలు ఖర్చవుతుండగా, దీనిలో రూ.18వేలు సబ్సిడీగా నెట్‌క్యాప్ చెల్లిస్తోందని, మిగిలిన రూ.42వేలను లబ్ధిదారుడు సమకూర్చుకోవాల్సి ఉండగా, బ్యాంకర్లు తమ ఖాతాదారులకు సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు రుణాల మంజూరుకు సహకరించాలని తెలిపారు. టిడ్కో ద్వారా నగర కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో నిర్మాణంలో ఉన్న అర్బన్ హౌసింగ్ రుణాల మంజూరులో జాప్యం లేకుండా బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. ప్రభుత్వం పూర్తి బాధ్యతతో నిర్మిస్తున్న అర్బన్ గృహాలకు లీగల్ ఓపీనియన్ లాంటి అంశాలను మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, తగిన విధంగా చర్యలు చేపట్టి పరిష్కరించాలన్నారు. అలాగే వివిధ కార్పొరేషన్లు, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖల ద్వారా లబ్ధిపొందుతున్న లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను పూర్తి చేసి రైతుల ఖాతాలో ప్రభుత్వ లబ్ధిని చేకూర్చాలని బ్యాంకర్లకు సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆర్ రామ్మోహన్‌రావు మూడు క్వార్టర్లలో బ్యాంకుల పనితీరును వివరిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.32,300 కోట్ల రుణాల లక్ష్యంగా 74శాతంతో రూ.23,900కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు రూ.4,900కోట్ల లక్ష్యానికి రూ.4,100కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జెడ్ ఫిషరీస్ యాకూబ్ బాషా, నెట్‌క్యాప్ పీవో కే శ్రీనివాసరావులతోపాటు వివిధ మున్సిపల్ కమిషనర్లు, వివిధ బ్యాంకుల యూనిట్ ఆఫీసర్లు, కార్పొరేషన్ల ఈడీలు, తదితరులు పాల్గొన్నారు.

దేశంలో సులభతర వాణిజ్య అనుమతుల్లో
మొదటి స్థానంలో ఏపీ
* పరిశ్రమల శాఖ కమిషనర్ జైన్

విజయవాడ, ఫిబ్రవరి 20: సులభతర వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్ గత రెండు సంవత్సరాలుగా దేశంలో మొదటి స్థానంలో ఉందని ఈ ఏడాది కూడా మొదటి స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వ్యాపారులందరూ ఫీడ్‌బ్యాక్‌లో సింగిల్ పోర్టల్ ఆన్‌లైన్ విధానంపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ అన్నారు. బుధవారం నగరంలోని ఆటోమొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్ హాల్‌లో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’పై నాలుగు జిల్లాల ప్రాంతీయ సదస్సులో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైన్ మాట్లాడుతూ భారతదేశంలో గత రెండు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. ఆన్‌లైన్ విధానంపై ఉన్న ఇబ్బందులపై ముఖాముఖి చర్చించి పరిష్కరించేందుకు ప్రాంతీయ (కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి) ఈవోడీబీ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. సింగిల్ డస్క్ పోర్టల్‌లో ఆన్‌లైన్ విధానాల్లో పరిశ్రమలు స్థాపించే వారికి 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్నామన్నారు. అదే విధంగా ఇతర దేశాలైన యునైటెడ్ కింగ్‌డమ్ లాంటి చోట్ల పరిశ్రమలు స్థాపించే వారికి ఇస్తున్న అనుమతులపై కూడా దృష్టి పెట్టి పరిశీలిస్తున్నామన్నారు. ఈ సదస్సులో డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఉమామహేశ్వరరావు, సీఆర్‌డీఏ జాయింట్ డైరెక్టర్ ధనుంజయరెడ్డి, కృష్ణాజిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ సుబ్రహ్మణ్యం, ఐలా చైర్మన్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.