విజయవాడ

ఈవీఎం, వీవీ ప్యాట్లపై ప్రజలకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, ఫిబ్రవరి 20: ఈవీఎం, వీవీ ప్యాట్లపై ప్రచార రథాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి తెలిపారు. నగరంలోని నోవాటెల్ ఆవరణ వద్ద బుధవారం ఈవీఎం, వీవీ ప్యాట్‌లపై అవగాహన కల్పించే ప్రచార రథాన్ని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేది, కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ వోటర్ వెరిపైయిడ్ పేపర్ అడిట్ ట్రైలపై జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రజలు ముఖ్యంగా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు వాహనాలను వినియోగించి మొత్తం 32ప్రచార రథాల ద్వారా ఈనెల 25నుండి అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు పరిధిలో సంచారం జరిపి ఓటర్లకు ఈవీఎం, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను సందేహాలు నివృత్తి నిమిత్తం అవగాహన పరిచేందుకు ప్రచార రథాలు దోహదపడతాయని కలెక్టర్ చెప్పారు. 18ఏళ్లు నిండి యువ ఓటర్లుగా నమోదై తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వారు ఈ ప్రచారం వలన ఓటుపై పూర్తి అవగాహన కలిగి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వచ్చి ఉత్సాహం చూపుతారన్నారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఏర్పడి పోలింగ్ పక్రియ వేగవంతం జరిగేందుకు ఎక్కువ శాతం ఓట్లు పోల్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ ఇంతియాజ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వివరించారు.

జనసేన అభ్యర్థిత్వాలకు దరఖాస్తు గడువు 25
* స్క్రీనింగ్ కమిటీ ముందుకు 170 బయోడేటాలు
విజయవాడ (సిటీ), ఫిబ్రవరి 20: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల నుండి జనసేన పార్టీ తరపున పోటీ చేసేందుకు అధిక శాతం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతం నుండి ఆశావహులు పోటీ పడుతున్నారు. జనసేన అభ్యర్థిత్వం ఆశించేవారు ఈ నెల 25లోగా దరఖాస్తులను తమకు అందించాలని పార్టీ స్క్రీనింగ్ కమిటీ సూచించింది. గాయత్రి నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం స్క్రీనింగ్ కమిటీకి 170 మంది ఆశావహలు తమ బయోడేటాను అందించారు. వారం రోజులుగా పార్టీ ఆఫీసులోనే స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. మాదాసు గంగాధరం నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల స్క్రీనింగ్ కమిటీ వచ్చిన బయోడేటాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఆశావహులతో నేరుగా మాట్లాడి వివరాలు సేకరిస్తోంది. ఉత్తరాంధ్రలోని కురుపాం, పాడేరు, పాలకొండ, అరకు, సాలూరు రిజర్వ్‌డ్ స్థానాల నుండి అభ్యర్థిత్వం ఆశిస్తూ అనేక మంది విద్యావంతులు బుధవారం వచ్చారు. వీరిలో వైద్యులు కూడా ఉన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుండి కూడా పోటీకి ఆసక్తి కనబరుస్తూ పలువురు విద్యావంతులు తమ బయోడేటా అందించారు. రాజకీయ, సామాజిక రంగాల్లో పనిచేసిన కుటుంబ నేపథ్యం ఉన్న గృహిణులు పలువురు పోటీకి ఉత్సాహం కనబరుస్తూ బయోడేటా అందించారు. నవతరం ఆకాంక్షలు జనసేన ద్వారానే కార్యరూపం దాల్చుతాయని, పాలనలో జవాబుదారీతనం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం పవన్‌కళ్యాణ్ సిద్ధాంతాల ద్వారానే సాధ్యమవుతాయని బుధవారం వారిక్కడ కలిసిన విలేఖరులతో అన్నారు.