విజయవాడ

దేశ సరిహద్దుల్లో గుండెపోటుతో వీరజవాన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న నగరంలోని కేదారేశ్వరపేట శాంతినగర్‌కు చెందిన వీరజవాన్ గుంటగాని ప్రవీణ్‌కుమార్(26) మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ప్రవీణ్‌కుమార్ భౌతికకాయాన్ని ఆర్మీ సిబ్బంది బుధవారం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు సారథ్యంలో స్థానిక పోలీసు అధికారులు ర్యాలీగా వారి ఇంటికి తోడ్కొని వచ్చారు. సాయంత్రం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. 1992 మే 26న జన్మించిన ప్రవీణ్‌కుమార్ తండ్రి 20ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేస్తూ ఓ ప్రమాదంలో 1989లో కన్నుమూశారు. తర్వాత తల్లి కూడా మరణించారు. ప్రవీణ్‌కుమార్ అవివాహితుడు. ఆయనకు ఓ సోదరి ఉన్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ప్రవీణ్‌కుమార్ ఐదేళ్ల క్రితం బీఎస్‌ఎఫ్‌లో చేరారు. రెండున్నరేళ్లు కోల్‌కత్తాలో శిక్షణ పొంది, తర్వాత దేశ సరిహద్దు కాశ్మీర్‌కు వెళ్లారు. ప్రవీణ్‌కుమార్ మరణవార్త తెలిసిన వివిధ రాజకీయ పక్షాల నేతలు, వందల సంఖ్యలో వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు శాంతినగర్‌లో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
ఘనంగా అంత్యక్రియలు
పాతబస్తీ: ప్రవీణ్‌కుమార్ భౌతికకాయాన్ని ఆయన ఇంటి నుంచి భవానీపురంలోని క్రిస్టియన్ శ్మశానవాటిక వరకు ప్రభుత్వ లాంఛనాలతో తరలించారు. ఎర్రకట్ట రోడ్డు మీదుగా చిట్టినగర్, సొరంగం, గొల్లపూడి బైపాస్ రోడ్డు నుంచి ఆర్టీసీ వర్కుషాప్ రోడ్డు ద్వారా శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. స్నేహితులు, బంధువులు, అభిమానులు జాతీయ జెండాలు చేతబట్టి ప్రవీణ్‌కుమార్ అమర్ రహే.. పాకిస్తాన్ డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమాధిలో భౌతికకాయాన్ని ఉంచి మతపెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సీఆర్‌పీఎఫ్, కాశ్మీర్ నుంచి వచ్చిన బీఎస్‌ఎఫ్ ఏఎస్‌ఐ జేకే ద్వివేది, నగర డీసీపీ-2 వెంకటప్పల నాయుడు, వెస్ట్ ఏసీపీ సుధాకర్, భవానీపురం సీఐ మోహన్‌రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు మూడురౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. మతపెద్దల ప్రార్థనలతో సమాధి కార్యక్రమాన్ని పూర్తిచేశారు.