విజయవాడ

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 21: ఈనెల 27నుంచి జరగనున్న ఇంటర్ మీడియేట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 27 నుంచి మార్చి 18వరకూ జరిగే పరీక్షలకు అధికారులు తమకు నిర్దేశించిన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 154 కేంద్రాలలో లక్షా 20వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ముఖ్యంగా ప్రశ్నాపత్రాలను భద్రపర్చే కేంద్రాలతోపాటు వీటిని రవాణా చేసే ప్రాంతాలలో తగిన విధంగా రక్షణ చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాలు ఉండే ప్రాంతాలలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తగు సమాచారం ఇవ్వాలన్నారు. రెవెన్యూ విభాగం పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పరచాలని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ సమీప ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్ వస్తువులు అనుమతి లేదన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మంచినీరు, విద్యుత్, ఫర్నీచర్, వెలుతురు చక్కగా వచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల నిర్వహణలో జరుగుతాయన్నారు. మెడికల్ అండ్ హెల్త్ శాఖ ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ కిట్‌తో సిబ్బందిని నియమించాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆర్‌టీసీ బస్సులు ద్వారా పరీక్షా కేంద్రాలకు చేరేలా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షా నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి తమ పరిధిలో ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించాలని తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ జరిగే ఇంటర్ పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఇన్‌స్పెక్టింగ్ అధికారి సీఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి పరీక్షల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించగా, డీఆర్‌ఓ ఏ శ్రీనివాస్, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, తదితరులు పాల్గొన్నారు.

నేడు ఆర్టీసీ బోర్డు సమావేశం
* హాజరుకానున్న సభ్యులు * సంస్థ కార్మికుల సంక్షేమానికే పెద్దపీట
విజయవాడ (సిటీ), ఫిబ్రవరి 21: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బోర్డు సర్వసభ్య సమావేశం శుక్రవారం నగరంలో జరగనుంది. నూతన బోర్డు ఏర్పాటైన తరువాత నిర్వహిస్తున్న 4వ సమావేశాల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో సభ్యులు హాజరు కానున్నట్లు సంస్థ అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలోని ఆర్టీసీ హౌస్‌లో నిర్వహించే ఈ సర్వసభ్య సమావేశానికి మొత్తం 17 మంది సభ్యుల్లో 14 మంది వరకు హాజరు కావచ్చని సిబ్బంది భావిస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, వైస్ చైర్మన్ సురేంద్రబాబుతో పాటు మొత్తం 17 మంది సభ్యులు ఉన్న బోర్డులో ఆర్టీసీ నాలుగు జోన్‌ల పరిధిలో నలుగురు సభ్యులు హాజరు కానున్నారు. అలాగే న్యూఢిల్లీకి చెందిన ఈడీ ఎస్‌ఆర్‌టీయూ కెప్టెన్ రత్న పార్కి, పుణే సీఐఆర్‌టీ డైరెక్టర్ కెప్టెన్ రాజేంద్ర బీ సమీర్ పాటిల్, ఏపీ సచివాలయం నుండి నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టీఆర్ అండ్ బీ నీరబ్ కుమార్, స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్టమెంట్ కేవీవీ సత్యనారాయణ హాజరు కానున్నారు. వీరితో పాటు పలు విభాగాలకు చెందిన సభ్యులు కూడా ఈ బోర్డు సమావేశానికి హాజరు కానున్నారు. గత బోర్డు సమావేశాల్లో కంటే ఈసారి నిర్వహించే బోర్డు సమావేశాలకు సభ్యులు హాజరు ఎక్కువగా ఉండనున్నట్లు సంస్థ సిబ్బంది అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సభ్యులు సంస్థ సిబ్బందికి సమాచారం అందించారు. బోర్డు సర్వ సభ్యసమావేశంలో భాగంగా శుక్రవారం బోర్డు సభ్యులు సంస్థలో పని చేస్తున్న కార్మికులు, సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీట వేసేలా కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.