విజయవాడ

కొత్త కమిషనర్‌గా రామారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 22: తనదైన శైలిలో సుపరిపాలన అందించడమే కాకుండా నగర కీర్తి ప్రతిష్టతలను జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిన విజయవాడ నగర పాలక సంస్థ కమిష్ఘనర్ జే నివాస్ బదిలీ అయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీఎంసీ కమిషనర్ నివాస్‌ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గాను, శ్రీకాకుళం కలెక్టర్ ఎం రామారావు వీఎంసీ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖ ఎపీఐఐసీ కమిషనర్‌గా పనిచేస్తున్న నివాస్‌ను గత 2017 మే 10వ తేదీన వీఎంసీ కమిషనర్‌గా బదిలీ చేశారు. అప్పటి నుంచి బాధ్యతలు స్వీకరించిన నివాస్ నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారనే చెప్పాలి. ప్రజలకు మెరుగైన సేవలందించడమే కాకుండా ఉద్యోగుల పక్షాన నిలిచి వారితో వారి విధులను సమర్ధవంతంగా నిర్వర్తింపచేసే నగర పౌరులకు ఉత్తమ సేవలందించారనడంలో అతిశయోక్తి లేదు. జాతీయ స్థాయిలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్ 2018లో విజయవాడ నగరానికి 5వ ర్యాంకు రావడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిరంతరం ప్రజలకు, నగర ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ ఏ సమయంలోనైనా స్పందించే నివాస్ నగరం విడిచి వెళ్లడం కొంత విచారకరమైన విషయం అన్నది చెప్పుకోదగినది. ప్రతి రోజూ ఉదయం నగర పర్యటనలో పౌర సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంలోనూ, రాష్ట్ర విభజన తరువాత రాజధాని అమరావతి నగరానికి ముఖద్వారంగా ఉన్న విజయవాడ నగరానికి అన్ని రంగాల్లోనూ ప్రాముఖ్యత తీసుకురావడంలో అవిరళ కృషి చేసిన వైనం గమనార్హం. నగరంలో జరిగిన ఎఫ్ 1, హెచ్ 2ఓ బోట్ రేస్‌లు, వైమానిక విన్యాస ప్రదర్శనల నిర్వహణలో నగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం నివాస్ కృషి అజరామమం. ఇలా చెప్పుకుంటే నివాస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత పాలన, అభివృద్ధిని రెండు సమానంగా తీసుకెళ్ళిన ఘనత ఆయనకే దక్కుతుంది. అంతేకాకుండా గతంలో ఓడీఎఫ్ లో అవార్డు తీసుకున్న నగరం ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకునకు అడుగులేయడమే కాకుండా 2019 స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో నగరాన్ని మొదటి స్థానంలో తీసుకువచ్చేందుకు విప్లవాత్మక చర్యలు చేపడుతున్న కమిషనర్ నివాస్‌కు ప్రస్తుతం బదిలీ రావడం నగర ప్రజలకు మింగుడు పడని ఉదంతమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా ఎన్నికల నిబంధనల మేరకు బదిలీ కావడం తప్పనిసరని చెప్పవచ్చు.

అపరిష్కృత సమస్యలపై ఉద్యమ కార్యాచరణ
28న విశాఖలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ 13వ మహాసభలు
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 22: ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ (సీఐటీయూ) 13వ మహాసభ ఈనెల 28వ తేదీన విశాఖలో జరుగుతుందని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నగరంలోని ఎన్‌జీవో హోమ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28, మార్చి 1,2వ తేదీల్లో జరిగే ఈ మహాసభలకు విశాఖ మున్సిపల్ కమిషనర్ ఎం హరినారాయణ్ ఆహ్వాన సంఘం చైర్మన్‌గా సభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపల్ రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలకు వ్యతిరేకంగా జరిపిన ఉద్యమాల ఫలితాల స్ఫూర్తిగా అనేకానేక అపరిష్కృత సమస్యలపై ఉద్యమ కార్యాచరణకు ఈ మహాసభలు వేదికలు కానున్నాయని తెలిపారు. విజయవాడ, విశాఖ నగర పాలక సంస్థల ఉద్యోగులకు 010 జీవో జీతాల అమలు, 151 జీవో ప్రకారం వేతనాల అమలు, 14నెలల ఎరియర్స్, వేతనాల సాధనతోపాటు 279 జీవో అమలుకు అడ్డంకులపై ఉద్యమాలతో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 50 మంది వరకూ జైలుపాలైనారని, అలాగే వందలాది కార్మికులపై అక్రమ కేసులు బనాయించిన విషయాలు అందరికీ తెలిసిందేనన్నారు. ఇదిలావుండగా 142 జీవో వేతనాల అమలుతోపాటు మరిన్ని సమస్యలపై మహాసభలో చర్చించి ఉద్యమకార్యాచరణ రూపొందించే ఈ సభలకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు.