విజయవాడ

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు మీడియా సహకారం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, : రానున్న సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగంతోపాటు మీడియా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ కోరారు. శుక్రవారం నగరంలోని క్యాంపు కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలులో సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్లపై ఆయన మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని ఇదే స్ఫూర్తితో రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించేందుకు మీడియా తమ తోడ్పాటును అందించాలన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదుకు అవసరమైన ఫారం 6, మార్పులు, చేర్పులకు ఫారం 7, 8, 8ఏ పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతున్నామన్నారు. జిల్లాలో నేటి వరకు 33,03,592 మంది ఓటర్లు ఉన్నారని వీరిలో 2.50 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు కాబడ్డారన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదు, ఇవిఎం, వీవీప్యాట్‌లపై ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా జిల్లాలోని అన్ని థియేటర్లు, స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలు, ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా ఈనెల 25వ తేదీ నుండి స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 3,918 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు 30 వేల మంది అధికారులు, సిబ్బంది అవసరం కాగా, 33వేల మంది సిబ్బంది వివరాలను డేటా బేస్‌లో నమోదు చేసి సిద్ధంగా ఉంచామని తెలిపారు. 1950 హెల్ప్‌లైన్ నెంబర్‌క ఫోన్ చేసి ఓటర్లు తమ వివరాలను, ఏ పోలింగ్ స్టేషన్‌లో ఓటు ఉన్నది, తదితర విషయాలు తెలుసుకోవచ్చన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో జేసీ 2 పీ బాబూరావు, డీఆర్‌ఓ ఏ ప్రసాద్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఖాజావలి ఉన్నారు.