విజయవాడ

ప్రాణరక్షణకే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మార్చి 19: సమాజంలో గౌరవం, జీవనోపాధి కల్పించి చక్కని వేతనం అందిస్తున్నందుకు సమాజానికి మీరు అందిస్తున్న ప్రతిఫలం ఇదేనా? అని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ప్రాణహాని తలపెడుతున్న డ్రైవర్లపై ఇక నుండి మరింత కఠినంగా వ్యవరిస్తానని హెచ్చరించారు. విద్యాధరపురంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శిక్షణ కళాశాలలోఫేటల్ యాక్సిడెంట్లు చేసిన డ్రైవర్లకు ప్రమాద నివారణపై నిర్వహించిన తరగతులకు మంగళవారం ఆయన హాజరయ్యరు. ప్రమాదాలకు మీరు బాధ్యులే కదా, దీనికి మీరేం సమాధానం చెప్తారని నిలదీశారు. యాక్సిడెంట్లు చేసిన ప్రతి ఒక్క డ్రైవరును వాస్తవంగా జరిగిన వివరాలు అడిగి తెలసుకున్నారు. ప్రమాదానికి డ్రైవరు ఎంతవరకు బాధ్యుడో వివరించి చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవరు ఎంత వేగంలో వెళ్తున్నాడో ఆరా తీశారు. ఇంతకుముందు కూడా ప్రమాదాలు చేశారా అని అడిగి తెలుసుకున్నారు. ఓవర్ టేక్ చేస్నున్న సందర్భంలో రోడ్డు నియమాలు పాటించకపోవడం గురించి, ఎందుకు పాటించలేదని నిలదీశారు. మీ అజాగ్రత్త కారణంగా ఎదుటివారి ప్రాణాలు పోగొట్టి, వారి కుటుంబాల్ని రోడ్డున పడేసే హక్కు మీకెక్కడిది అంటూ ప్రశ్నించారు. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో పొగమంచు కారణంగా ఎదుటి వాహనాన్ని పసిగట్టలేక పోయానని ఓ డ్రైవరు ఇచ్చుకున్న వివణకు ఎండి సురేంద్రబాబు విభేదిస్తూ అసలు ఎదురు వాహనం కనిపించనంత పొగమంచు ఉన్న సమయంలో ఓవర్ టేక్ చేయాలనుకోవడం క్షమించలేని తప్పిదమే అవుతుందన్నారు. బెంగళూర్ మెజెస్టిక్ బస్సు స్టేషన్‌లో కండక్టరు అందుబాటులో ఉన్నా కూడా, వాహనాన్ని రివర్స్ చేసే సమయంలో వెనుక దూరంగా చెట్టు కింద కూర్చుని ఉన్న ప్రయాణికుల మీదికి బస్సు నడిపి ప్రాణాలు పోగొట్టిన డ్రైవర్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. దాదాపు అన్ని కేసులలోనూ డ్రైవర్ల తప్పిదమే ప్రధాన కారణంగా కనిపిస్తోందన్నారు. ఏమాత్రం కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి ఉన్నా, ఎక్కువ అపాయం జరిగేది కాదన్నారు. ప్రమాదాలు చేసే ప్రజల ప్రాణాలు హరించే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. ఆర్టీసీ డ్రైవర్లుకు కూడా అందులో మినహాయింపు ఏమీ ఉందన్నారు. మద్యం తాగి డ్యూటీలకు వచ్చే డ్రైవర్లు హత్యాప్రయత్నం చేసినట్లేనని, అలాంటి వారి పట్ల నిర్దయగా వ్యవహరిస్తానన్నారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోనుల్లో మాట్లాడటం ఆపకపోతే ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి చేజేతులా తెచ్చుకున్న వారవుతారని తీవ్రస్వరంతో హెచ్చరించారు. జరిగే ప్రమాదాలలో దాదాపు 95శాతం ప్రమాదాలు ఏమాత్రం జాగ్రత్త చూపినా నివారించదగ్గవేనని తీవ్రస్థాయిలో మందలించారు. భార్యబిడ్డల్ని, తల్లిదండ్రుల్ని పోహించుకోవడానికి సంస్థలో ఉద్యోగం పొంది, డ్యూటీలో ప్రమాదాలకు కారకులవుతూ ప్రయాణికులకు ప్రాణహాని తలపెడుతున్న డ్రైవర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. సంస్థ డ్రైవర్లుగా బాధ్యతగా వ్యవహరించాల్సిందిపోయి, అలవోకగా ప్రాణాలు హరిస్తున్నారని, చిన్న చిన్న తప్పిదాలు చేసి పెద్ద పెద్ద ప్రమాదాలకు కారకులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు తెలుకోకుంటే ఇంటిదారి పట్టాల్సి ఉంటుందన్నారు. గడచిన సంవత్సరంలో 478 మంది ప్రాణాలు కోల్పోయారని, అంటే రోజుకు ఒకరు లేదా ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాల బారి నుండి కాపాలడాల్సిన డ్రైవర్లే, అజాగ్రత్తతో వారి ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. పెద్ద చదువులు చదివినవారే ఉద్యోగవకాశాలు లేక బాధ పడుతుంటే, కేవలం కొద్దిపాటి చదువు మరియు డ్రైవింగ్ అర్హతలతో డ్రైవరు ఉద్యోగం సాధించుకుని 30 నుండి 40 వేల జీతం పొందుతూ ఉద్యోగం పట్ల గౌరవం చూపించాల్సింది పోయి, నమ్మి వచ్చిన ప్రయాణికుల ప్రాణాలు, రోడ్డు మీద నడుసున్న పాదచారుల ప్రాణాలు పోగొట్టడం విశ్వాస ఘాతుకం లాంటిదన్నారు. తప్పు చేసిన డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, కానీ పోయిన ప్రాణాల్ని తీసుకొచ్చే శక్తి ఎవరి చేతుల్లోనూ లేదన్నారు. దయచేసి ప్రతి ఒక్క డ్రైవరూ ఈ విషయం అర్థం చేసుకోవాలని, ప్రతి క్షణం ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రామాదాలు చేయకుండా డ్రైవింగ్ చేయాలన్నారు. తన కుటుంబం మొత్తం తన ఉద్యోగం పైనే ఆధారపడి ఉన్నారన్న విషయం కూడా మనసులో గుర్తుంచుకుని డ్యూటీ చేయాలని సురేంద్రబాబు సూచించారు. శిక్షణ తరగతుల్లో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీఆర్‌కే ప్రసాద్, రాష్ట్రంలోని వివిధ డిపోల నుండి సుమారు 40 మంది డ్రైవర్లు పాల్గొన్నారు.