విజయవాడ

ఆర్థిక నేరాల కట్టడి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 20: ఆర్థిక నేరాలను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ముందస్తు జాగ్రత్తలు, డిజిటల్ వాలెట్ పాత్ర అనే అంశంపై పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డిజిటల్ వాలెట్ సంస్థల ప్రతిధులు, పేటీఎం, ఎయిర్‌టెల్ మనీ, ఓలా మనీ, జియో మనీ, ఫోన్‌పే, పేజాడ్ యూకో బ్యాంకు, సిటీ యూనయన్ బ్యాంకు, ప్లేగేమ్స్, హెడ్‌డిఎఫ్‌సీ బ్యాంకు, తదితర వారితో సమావేశం కొనసాగింది. ఆన్‌లైన్ విధానం ద్వారా నగదు బదిలీ, లావాదేవీలు, కొనుగోళ్లు, విక్రయాలు, ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో జరుగుతున్న మోసాలు, ఓటీపీ, ఓపీటీ లేకుండా జరుగుతున్న ఆర్థిక మోసాలు, నకిలీ వెబ్‌సైట్ గూర్చి చర్చించారు. అదేవిధంగా నగదు రహిత లావాదేవీలకు సంబంధించి భద్రతా చర్యలు, వినియోగదారుని నగదుకు భద్రత, సైబర్ నేరాగాళ్ల గుర్తింపు వంటి అంశాలకు సంబంధించి డిజిటల్ వాలెట్ ప్రొవైడర్లకు పోలీసు శాఖ తరుఫున సూచనలు చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులకు సీపీ సర్ట్ఫికెట్లు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ నవదీప్ సింగ్ గ్రావెల్, ఏడీసీపీ నవాబ్ జానీ, టాస్క్ఫోర్స్ ఏడీసీపీ కేవీ శ్రీనివాసరావు, ఎస్‌బీ ఏసీపీ రాజీవ్‌కుమార్, ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి, టాస్క్ఫోర్స్ ఏసీపీ సూర్యచంద్రరావు, సీసీఆర్‌బీ ఏసీపీ రమేష్‌బాబు, సీసీఎస్ ఏసీపీ మగ్బుల్, మహిళా పోలీస్టేషన్ ఏసీపీ కేవీ శ్రీలక్ష్మీ, సీటీసీ సీఐ కే శ్రీనివాసరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.