విజయవాడ

నామినేషన్ వ్యయంపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 20: సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులు చేసే వ్యయాలపై ఎన్నికల అధికారులు పలు రూపాలుగా పరిశీలన చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు వినియోగించే జెండాలు, వాహన వినియోగం, ఇంధన వినియోగం, జన సమీకరణలపై కూడా నిఘా నేత్రం నిశితంగా పరిశీలిస్తోంది. ఇందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించే అధికారితోపాటు జరిగే ప్రక్రియను వీడియో వీవీంగ్ టీమ్ అధికారులు అడుగడుగునా చిత్రీకరించి, దృశ్యాలలో కనిపించే వ్యయ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అధికారుల పరిశీలనలో తేలిన వ్యయానికి, అభ్యర్థులు సమర్పించే వ్యయానికి తేడా గుర్తిస్తే, గుర్తించిన తేడాను అభ్యర్థి ఖాతాలో జమ చేస్తారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో పాల్గొనే ప్రజల రవాణా వ్యయాన్ని కూడా అభ్యర్థుల వ్యయ పరిమితిలోకే వస్తుందని సమాచారం. ఎమ్మెల్యే అభ్యర్థికి 28లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.78లక్షలను వ్యయ పరిమితిగా నిర్ణయించగా, పోటీ అభ్యర్థులు ఈ వ్యయ పరిమితిలోపే ఎన్నికల తేదీ వరకూ ఖర్చులు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 18నుంచి ప్రారంభమైన విషయం విధితమే. నామినేషన్ వేసిన దగ్గర నుంచి అభ్యర్థి చేసిన వ్యయం అభ్యర్థి పరిధికి వస్తుందని, నామినేషన్‌కు ముందు జరిగిన ఖర్చు పార్టీ ఖర్చు పరిధిలోకి వస్తుందన్న వాదనలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నాటి నుంచి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్న వైనంతో అప్పటి నుంచే ఖర్చు లెక్కలను పరిగణలోకి తీసుకుంటామని మరికొంత మంది అధికారులు తెలుపుతుండగా, ఈవిషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికలకు వ్యయ పరిమితి నిబంధనలు అభ్యర్థుల గొంతులో పచ్చి వెలక్కాయ లాగా మారిందనే చెప్పవచ్చు.