విజయవాడ

సుస్థిర అడవులతో మానవాళి అభివృద్ధి సుసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: విద్యార్థి దశ నుంచే పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండాలని, సుస్థిర అడవులతో మానవాళి అభివృద్ధి సుసాధ్యమవుతుందని జిల్లా అటవీ శాఖాధికారి ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా గురువారం గోపాలరెడ్డి రోడ్డులోని కస్తూరిబాయిపేట జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్‌కోర్, అటవీ శాఖ సంయుక్త సహకారంతో అటవీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ప్రతి ఏడాది మార్చి 21న ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. విద్యార్థి దశ నుండే పర్యావరణం పట్ల, అడవులు, అటవీ యాజమాన్యం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం భూభాగంలో 33శాతం అటవీ విస్తీర్ణం ఉండాలన్నారు. వెంకటేశ్వర విద్యాలయ పాఠశాల ప్రిన్సిపాల్ ఊటుకూరి రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులు సార్వత్రిక విద్యతో పాటు పర్యావరణ విద్యలోనూ రాణించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్‌కోర్ జిల్లా సమన్వయకర్త ఎం సురేష్ మాట్లాడుతూ కొద్దికాలంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడంలో రాష్ట్రంలోనే తమ సంస్థ ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్లు ఆర్వీ ప్రసాద్, రామారావు, కే శ్రీనివాసులరెడ్డి, త్రినాథ్ ప్రసాద్, సుజాత, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.