విజయవాడ

బాబు రాక్షస పాలనకు జగన్‌తోనే చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 21: రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డితానే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం 2.01 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించుకున్న మల్లాది, ఆసమయం కల్లా రిటర్నింగ్ అధికారి ఆఫీస్‌లోకి ప్రవేశించి నామినేషన్ దాఖలుచేశారు. తొలుత సీతన్నపేట గాయత్రీ కనె్వన్షన్ హాల్ వద్ద నుంచి భారీ ర్యాలీతో వీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో భూకబ్జాలు, అవినీతి, అక్రమాలే పెచ్చురిల్లాయని, తెలుగు దొంగల పార్టీగా తయారైన టీడీపీ పాలనకు గుణపాఠం చెప్పేందుకు తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సంక్షేమ, అభివృద్ధి మాటున టీడీపీ కొనసాగించిన అవినీతి పాలనకు ఓటుతో చరమగీతం పాడాలని, వైసీపీ విజయానికి కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దామన్న మల్లాది విష్ణు అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని పిలుపునిచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ జన రంజకమైన పాలన అందించాలంటే జగన్‌తోనే సాధ్యమని, రానున్న ఎన్నికలు ఎంతో కీలకమన్న ఆయన అవినీతికి, నీతికి మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. భూ బకాసులు, భూ కబ్జాకోరులుగా మారిన టీడీపీ పాలకులను రాష్ట్రం నుంచి తరిమివేయాలన్నారు. నియోజకవర్గంలోనే కాక రాష్ట్రం, రాష్ట్ర పరిధులు దాటిన కబ్జాలతో సంబంధం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేను మళ్లీ గెలిపిస్తే సామాన్య ప్రజల ఆస్తులను కూడా కొల్లగొడతారన్నారు. సెంట్రల్‌లో సుపరిపాలన జరగాలన్న లక్ష్యంతో తాను మల్లాది విష్ణుకు మద్దతిస్తున్నానని ప్రకటించిన కోగంటి సత్యం అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలుగా మనందరిపై ఉందని, ఇందుకు అందరూ సమాయత్తమవ్వాలని పిలుపునిచ్చారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, మాజీ మేయర్ రత్నబిందు, వైసీపీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, కార్పొరేటర్లు అవుత శ్రీశైలజా, జమల పూర్ణమ్మ, వైసీపీ నాయకులు బుద్దా నాగేశ్వరరావు, వాసిరెడ్డి అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా భవకుమార్ నామినేషన్
పటమట, మార్చి 21: విజయవాడ తూర్పు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా బొప్పన భవకుమార్ గురువారం ఉదయం వీఎంసీ కార్యాలయంలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం పటమట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని భద్రయ్యనగర్ ఆయన నివాసం నుండి కోలాహలంగా వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో ప్రారంభమైన భారీ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, రామలింగేశ్వర్‌నగర్, కృష్ణలంక జాతీయ రహదారి మీదుగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి వీఎంసీ కార్యాలయానికి చేరుకుని తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దాదాపు గంటపాటు కొనసాగిన బొప్పన భవకుమార్ ర్యాలీలో అభిమానులు, వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జై జగన్, జై జై జగన్, బొప్పన జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బొప్పన భవకుమార్ మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలన్నారు. వైకాపాతోనే పేదలు, బడుగులు బతుకులు బాగుపడతాయన్నారు. వచ్చేనెల 11న జరగనున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా తనను, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పీవీపీని అత్యధిక ఓట్లతో గెలపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, వైకాపా అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.