విజయవాడ

ఎమ్మెల్యే బొండా ముమ్మర ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 23: సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి బొండా ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రచారం ముమ్మరం చేసిన బొండా శనివారం స్ధానిక 19వ డివిజన్ సీతారాంపురం కట్ట వద్ద నుంచి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించారు. గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరినీ ఓట్లు అభ్యర్ధించారు. గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజలకు అందిన తీరును తెలియచేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగాలంటే మళ్ళీ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విఙ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి అఖండ మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. ఇప్పటి వరకు కానరాని ప్రతిపక్ష వైసీపీ పార్టీ నేతలు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా వచ్చి హామీలు ఇస్తున్నారని ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత, డివిజన్ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్, ముక్కంటి నారాయణమ్మ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
45వ డివిజన్‌లో..
అదేవిధంగా స్ధానిక 45వ డివిజన్‌లో శనివారం ఉదయం బొండా ఉమా విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఆయన సతీమణి బొండా సుజాత, ఏంపి అభ్యర్ధి కేశినేని నాని సతీమణి పావని డివిజన్‌లోని ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్ధించారు. బొండా ఉమా, కేశినేని నానిలను మరలా తమ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుని అభివృద్ధి, సంక్షేమానికి పీట వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ ఐదేళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్ ఆత్కూరి రవి, డివిజన్ అధ్యక్షులు పివిఆర్, స్ధానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
46లో సైకిల్ యాత్ర
బొండా విజయాన్ని కోరుతూ ఆయన తనయుడు బొండా సిద్ధార్ధ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 46వ డివిజన్‌లో సైకిల్ యాత్ర నిర్వహించారు. ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద నుంచి బయలుదేరి డివిజన్‌లోని ప్రతి ప్రాంతంలో సైకిల్‌పై సంచరిస్తూ ప్రచారం చేపట్టారు. తెలుగుదేశం పార్టీకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మళ్లీ తన తండ్రి ఉమాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్ పిన్నంరాజు త్రిమూర్తిరాజు, డివిజన్ అధ్యక్షులు చంచు రామకృష్ణప్రసాద్, మురళి, మాల్యాద్రి, బాబి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్ధానిక 56వ డివిజన్ వాంబేకాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్ బుగతా ఉమామహేశ్వరి, డివిజన్ అధ్యక్షులు శ్రీరాములు, నాయకులు పాల్గొన్నారు.