విజయవాడ

అభివృద్ధే టీడీపీని గెలిపిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: ఏప్రిల్ 11న జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా మరోసారి విజయకేతనం ఎగురవేస్తుందని, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన 2వ డివిజన్ గణేష్‌నగర్ కాలనీలో డివిజన్‌లోని వివిధ సంఘాలు, పలు కాలనీల వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంగా పని చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది ఇటువంటి కాలనీలను చూసినప్పుడు తెలుస్తుందన్నారు. ప్రచారానికి ముందు ఎమ్మెల్యే గద్దె తొలుత 3వ డివిజన్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మాత మందిరాన్ని దర్శించుకున్నారు. ఫాదర్ తెలగతోటి జయరాజ్ గద్దెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవినేని అపర్ణ, జాస్తి సాంబశివరావు, యలమంచిలి పండు, నందిపాటి దేవానంద్, యలమంచిలి గౌరంగబాబు, తూమాటి ప్రేమ్‌నాథ్, ముమ్మనేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సత్కారం
23వ డివిజన్‌లోని వాసవి కళ్యాణ మండపంలో గద్దె రామ్మోహన్‌ను ఆర్యవైశ్య సంఘం తరపున పలువురు సం ఘ ప్రతినిధులు, ప్రముఖులు ఘనం గా సన్మానించారు. శాలువాలతో సత్కరించి మళ్లీ మీరే రావాలంటూ ఆశీర్వదించారు. కార్పొరేటర్లు గొరపర్తి నరసింహరావు, చందన సురేష్, నాయకు లు మానేపల్లి మాణిక్యాలరావు, గొం టా రామ్మోహనరావు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ అనూరాధ పర్యటన
జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తన భర్త గద్దె రామ్మోహన్ తరపున కృష్ణలంకలో ఎంపి కేశినేని నాని కుమార్తె హైమతో కల్సి విస్తృతంగా పర్యటించారు.