విజయవాడ

నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 24: 2019 సార్వత్రిక ఎన్నికలకు ఈనెల 18న ప్రారంభమైన నామినేషన్ల పర్వం 25న సోమవారంతో ముగియనున్నది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు అన్ని రాజకీయ పా ర్టీల పోటీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కాకుండా వీరిలో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయగా, చివరి రోజు మిగిలిన వారు కూడా తమ నామినేషన్లకు సమాయత్తమవుతున్నా రు. కాంగ్రెస్ పార్టీ నగర పార్లమెంటు అభ్యర్థిగా నరహరశెట్టి నరసింహరావు, పశ్చిమ అభ్యర్థిగా ఎంజే రత్నకుమార్ లు సోమవారం నామినేషన్ వేయనున్నారు. ఇదిలావుండగా ఎన్నికలలో స్వ తంత్ర అభ్యర్థుల కోలాహలం ఎక్కువగా ఉండటం సహజం. కాగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు అతి కొద్దిగానే దాఖలు కావడం విశేషం. వీఎంసీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్, తూర్పు, దుర్గాఘాట్ వద్ద గల కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ఆఫీసులలో ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నాం 3 గంటల వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అయితే వ్యయ నియంత్రణలో భాగంగా ఎన్నికల నియమావళి, వ్యయ పరిశీలనలపై కఠినంగా వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారులు అభ్యర్థుల నామినేషన్లకు వస్తున్న జనాలు, వారి తరలింపు, వాహన వినియోగం, జెండాలు, టోపీలు కూడా అభ్యర్ధి నిర్ధేశిత వ్యయంలో జమ చేస్తున్నారు.
నామినేషన్లకు 25న తుది గడువు : కలెక్టర్
విజయవాడ (క్రైం) : ఈనెల 25వ తేదీ సోమవారం నామినేషన్లకు తుది గడువని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. జిల్లాలోని 16 నియోజకవర్గాలు, రెం డు పార్లమెంటు స్ధానాలకు సంబంధిం చి నామినేషన్లకు ఈనెల 25న గడువు ముగియనుందని, ఇందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అన్ని ఏర్పా ట్లు చేశామన్నారు. మధ్యాహ్నం 3 గం టలల్లోగా అభ్యర్ధులను నామినేషన్ దా ఖలుకై అనుమతిస్తామని ఇందుకు ముందుగా వచ్చినవారికి టోకెన్‌లను జారీ చేస్తామన్నారు. మధ్యాహ్నం 3గం టల్లోగా రిటర్నింగ్ కార్యాలయం పరిధి లో 100 మీటర్లల్లోగా చేరుకున్న అభ్యర్ధులను నామినేషన్‌లు స్వీకరించడాని కి పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
* ఎన్నికల వ్యయంపై గట్టి నిఘా
జిల్లాలో ఇప్పటివరకు రెండుకోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగిందన్నారు. రూ.కోటి 8లక్షల విలువైన బం గారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. 27వేల 330 అనుమతి లే ని బ్యానర్లు, పోస్టర్లు తొలిగించామన్నా రు. 33వేల లీటర్ల మద్యం సీజ్ చేశామ ని, 260 వ్యక్తులపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసి 226 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. జిల్లాలో పె ద్ద మొత్తంలో లావాదేవీలు జరిపే వా టిపై ముందస్తు సమాచారంకై పారిశ్రామిక వేత్తలు, బ్యాంకులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి అప్రమత్తం చేశామన్నారు.