విజయవాడ

అరాచక పాలనకు చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, మార్చి 24: ఏప్రిల్ 11తో రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్, వెలంపల్లి 26వ డివిజన్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ జగన్ ప్రకటించిన నవరత్నాలతో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనించేట్లుగా చేస్తానని అన్నారు. అనంతరం 26 డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సాయంత్రం ప్రచారంలో భాగంగా 30వ డివిజన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసిఫ్, కార్పొరేటర్లు బండి పుణ్యశీల, టీ జమలపూర్ణమ్మ, బట్టిపాటి సంధ్యారాణి, డివిజన్ అధ్యక్షులు గుడివాడ నరేంద్ర, 30వ డివిజన్ అధ్యక్షులు వెన్నం రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వెలంపల్లి సతీమణి ప్రచారం
39వ డివిజన్‌లో వెలంపల్లి సతీమణి శ్రీవాణి ఆదివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవ చేసే నాయకుడు వెలంపల్లిని, నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని హమీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మండేపూడి చటర్జీ, నగర అధికార ప్రతినిధి మనోజ్‌కొఠారి, 39వ డివిజన్ అధ్యక్షులు గ్రంధి రమేష్ తదితరులు పాల్గొన్నారు.