విజయవాడ

కేంద్ర పథకాల నిధులు రాష్ట్రంలో దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 24: ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ఇవే చివరి రోజులని బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహరావు విమర్శించారు. త్వరలోనే ఈ వెలుగు ఆరిపోతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని పాయకాపురంలో సెంట్రల్ అభ్యర్ధి వామరాజు సత్యమూర్తి, విజయవాడ ఎంపీ అభ్యర్ధి కిలారు దిలీప్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత స్థానిక సంతోషిమాతా దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ కేంద్ర పథకాలకు పసుపు రంగు పూసి తన కార్యక్రమాలుగా చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రజలను కూడా మోసం చేస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాకు మించిన ప్రయోజనాలను రాష్ట్రానికి కల్పిస్తామని, హోదా అనేది కొన్ని పరిమితులకు లోబడి ప్రయోజనాలుంటాయని, అంతకు మించి ప్రయోజనాలు కల్పిస్తామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో గెలిపించాలన్నారు. అవినీతి అక్రమాలలో కూరుకుపోయిన టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని, ప్రభుత్వ, ప్రజా ధనంతో ప్రచారానికి మితిమీరిన ఖర్చు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. పీఎంఏవై పథకంలో కూడా టీడీపీ పాలకులు అవినీతి కి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన రోడ్ షో కార్యక్రమం పాయకాపురం సంతోషి మాతా గుడి వద్ద నుంచి ప్రారంభమై సత్యనారాయణపురం, సీతారామపురం, తదితర ప్రాంతాల్లో జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, దాసరి ఉమామహేశ్వరరాజు, చిన్ని చిట్టిబాబు, మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి, షేక్ బాజీ, రాష్ట్ర కార్యాలయం ఇన్‌చార్జి తురగా నాగభూషణం, మహిళా మోర్చ జాతీయ కార్యదర్శి శరణాల మారుతీరాణి, బీజేపీ నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మీడియా కన్వినర్ గంగాధర్, ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు. డప్పు, వాయిద్యాలతో నేతలు, అభ్యర్థులు సాగించిన ఎన్నిలక ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది.