విజయవాడ

అన్ని హంగులతో రాజధానిని అభివృద్ధి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: విజయవాడ నగరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో గడిపేలా శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతానని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిలారు దిలీప్ అన్నారు. ప్రచారంలో భాగంగా అసెంబ్లీ సెంట్రల్ అభ్యర్థి వామరాజు సత్యమూర్తితో కలసి మంగళవారం 44 డివిజన్ గులాబీతోటలో ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఈసందర్భంగా దిలీప్ మాట్లాడుతూ విజయవాడకు అందుబాటులో ఉన్న రాజధాని అమరావతిని అన్ని హంగులతో అభివృద్ధిపరుస్తామన్నారు. ఇదే సమయంలో విజయవాడలో ముఖ్యంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఉదయం గన్నవరం వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర జాతీయ నేతలకు స్వాగతం పలికి ఆయన నగరానికి తోడ్కొని వచ్చారు.

రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యం
*తూర్పు వైసీపీ అభ్యర్ధి బొప్పన
పటమట, మార్చి 26: విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొప్పన భవకుమార్ పటమటలోని 12వ డివిజన్‌లో మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత డివిజన్‌లోని పటమటలంక చేపల మార్కెట్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంబేద్కర్‌నగర్, దర్శిపేట, పుట్టరోడ్డు, వల్లూరు సత్యనారాయణ నగర్, వల్లూరి పూర్ణచంద్రరరావు కాలనీ, పటమట, ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్ రోడ్డు, శాంతినగర్ తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి ఓట్లు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా బొప్పన భవకుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు కల్లబొల్లి కబుర్లు చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. టీడీపీ చోట, మోట నాయకులు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. గత ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం నాయకులు అవినీతిలో అనకొండను మించిపోయారని ఆరోపించారు. చంద్రబాబు మాటలను ప్రజలు మరోసారి నమ్మేస్థితిలో లేరని అన్నారు. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని తెలిపారు. రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. అంతుకుముందు డివిజన్ వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని బొప్పన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎంవిఆర్ చౌదరి, తుపాకుల మహేష్, చింతల సాంబయ్య, మాజీ కార్పొరేటర్ నడుకుదిటి సుబ్బరాజు, వల్లూరు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.