విజయవాడ

విజయవాడ పార్లమెంట్ సీటుకు బరిలో 15 మంది అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మార్చి 26: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్లలో 15 మంది పత్రాలను అమోదించినట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈనెల 25వ తేదీ వరకు మొత్తం 26 నామినేషన్లను స్వీకరించినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన అనంతరం 15 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగ్గా ఉన్నట్లు చెప్పారు. ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి కృతికా శుక్లా తెలిపారు. విజయవాడ పార్లమెంట్ బరిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కిలారు దిలీప్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్(నాని), యువజన శ్రమైక రైతు కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) అభ్యిర్థిగా పొట్లూరి వి ప్రసాద్, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా అందుకూరి విజయభాస్కర్, జనసేన పార్టీ అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాద్‌బాబుతో పాటు మరో 10మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో కేశినేని పావని, అమరేశ్వరి కిలారు, నరహరిశెట్టి మాధవి, సూరెడ్డి ఝాన్సీ, పివి కృష్ణయ్య, చిలకా బసవయ్య సమర్పించిన నామినేషన్లు తిరస్కరించినట్లు ఆమె వివరించారు.

చారిత్రాత్మక పథకం కనీస ఆదాయ భరోసా
* దారిద్య్ర రహిత భారత్ నిర్మాణమే రాహుల్ లక్ష్యం * పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 26: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కుంటుంబ ఆదాయ భరోసా పథకం చారిత్రాత్మకమని, దారిద్య్ర నిర్మూలనా భారత్ నిర్మాణమే లక్ష్యంగా రాహుల్ ప్రకటించిన ఈ పథకం దేశంలోని 20శాతం నిరుపేదలకు ఎంతో ప్రయోజనకరమని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ పథకం ప్రపంచంలోనే మొట్ట మొదటిదని దీనితో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించవచ్చని అన్నారు. నెలకు 6వేల రూపాయల చొప్పున కుటుంబంలోని మహిళల ఖాతాలో ఈ మొత్తం జమ జరుగుతుందన్నారు. దాదాపు 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరే ఈ పథకాన్ని బీజేపీ నేతలు విమర్శించడం హేయమన్నారు. ఒక పక్క ప్రధాని మోదీ సంపన్నులైన 25 కుటుంబాలకు మేలు చేసేందుకు పూనుకోగా రాహుల్ మాత్రం 25 కోట్ల మంది పేదలను ఆదుకునేందుకు సంకల్పించారన్నారు. 1971లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదంతో అనేక పథకాలను అమలు చేయగా, 70శాతం పేదరిక నిర్మూలన జరిగిందన్నారు. మిగిలిన 20శాతం పేదరికాన్ని కనీస ఆదాయ భరోసా పథకంతో జయించడానికి దారిద్య్ర రహిత భారత్ నిర్మాణానికి రాహుల్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇదిలావుండగా కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటంటున్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. ఏపీకి మొట్టమొదటి ద్రోహి కేసీఆర్ ప్రత్యేక హోదాకు అడుగడుగునా అడ్డుపడడం గర్హనీయమన్నారు. కేసీఆర్ మద్దతు వల్ల ఏపీ ప్రజలకు ఏమి ప్రయోజనం కలుగుతుందో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.