విజయవాడ

పడిపోతున్న బ్యారేజీ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఏప్రిల్ 17: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతోంది. గత పదేళ్ల కాలంలో ఇంత ఆందోళనకర స్థితిలో ఏనాడూ నీటిమట్టం తగ్గలేదని నీటి పారుదల శాఖ రికార్డులు చెబుతున్నాయి. 2018 ఏప్రిల్ 16 నాడు బ్యారేజీ వద్ద 11 అడుగుల నీరు ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ 16న మంగళవారం నీటిమట్టం 6.3 అడుగులుగా నమోదైంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు తాగు, సాగునీరు అందిస్తూ నిండుకుండలా ఉండే కృష్ణమ్మ కూడా మున్ముందు దాహం.. దాహం అంటూ కేకలేసే పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న మే నెలలో తాగునీటి ఎద్దడిని నివారించాలంటే కృష్ణానదికి పులిచింతల, లేదా నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండి నీరు విడుదల చేయాల్సి ఉంది. అధికారులు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థంకాని స్థితి నెలకొంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద గుంటూరు కాలువ, కృష్ణా కెనాల్స్ లాకులు పూర్తిగా మూసేశామని ప్రకాశం బ్యారేజీ లాకుల సూపరింటెండెంట్ ఉదయభాస్కర్ తెలిపారు. మే నెలలో గుంటూరు, విజయవాడ నగరవాసులకు నీటి ఎద్దడి నివారణ చర్యలు అధికారులకు పెనుభారమే అవుతున్నాయ.