విజయవాడ

దోమ, ఈగ కూడా దూరలేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఏప్రిల్ 17: వలయాలు వలయాలుగా ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య మనుషులే కాదు ఈగ, దోమ కూడా ఈవీఎంలను చూడలేవని నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు వ్యాఖ్యానించారు. గంగూరు ధనేకుల ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచామని తెలిపారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ పశ్చమ, సెంట్రల్, తూర్పు ఈవీఎంలను అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరిగేంతవరకు కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంటాయన్నారు. మచిలీపట్నం పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను బందరులోనే లెక్కిస్తారని తెలిపారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను 28 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామని తెలిపారు. రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో రాజకీయ నాయకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేసి రెండు తాళాలు వేశామన్నారు. సీఆర్‌పీ, సీఆర్‌ఎఫ్ ద్వారా వ్యూహాత్మకంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ వలయంలోకి ఎవరైనా వెళ్లటం అసాధ్యమని, వారు అడిగిన వివరాలు చూపలేకపోతే ప్రాణాల మీదికి వస్తుందని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్‌ల ఆవరణలో 24గంటలూ బందోబస్తు ఉంటుందన్నారు. పోలీస్ కమిషనర్‌గా బందోబస్తు పరిశీలనకు తాను వచ్చినా నమోదు పుస్తకంలో సంతకం చేసి వెళ్లాల్సిందేనని చెప్పారు. 28 సీసీ కెమెరాలు ఎప్పుడూ పనిచేస్తుంటాయని, 42రోజులు నిరంతరం పనిచేస్తుంటాయన్నారు. సీఈవో ఆఫీస్, కలెక్టర్ కార్యాలయం, సీపీ ఆఫీసుకు అనుసంధానం ఉంటుందన్నారు. అనుమతి పొందిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఈవీఎంలు చూడాలంటే రిటర్నింగ్ అధికారి అనుమతి పొంది చూడవచ్చని సీపీ తెలిపారు. కోగంటి సత్యం బొండా ఉమాపై ఎలాంటి కేసు పెట్టలేదని, శివకుమార్ అనే వ్యక్తిపై కేసు పెట్టాడని, అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ జరిగిందనటం వాస్తవం కాదని ఆయన ఖండించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడినా, అందుకు బాధ్యులు పోలీసులు కారన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే విషయం తెలుస్తుందని, అతని మృతికి కారకులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ద్వారకాతిరుమలరావు వివరించారు. డీసీపీ హర్షవర్ధనరాజు, క్రైం డీసీపీ రాజకుమారి, ఏసీపీ అంకినీడు ప్రసాద్, సీఐ పెద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.