విజయవాడ

‘మహిళామిత్ర’ పనితీరుపై డీసీపీ రాజకుమారి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 17: మహిళా మిత్ర సభ్యులతో క్రైం డీసీపీ బీ రాజకుమారి భేటీ అయ్యారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మహిళా మిత్ర చేస్తున్న కృషి, పనితీరుపై ఆమె సమీక్షించారు. కమిషనరేట్ పరిధిలో మహిళా సమస్యలపై పని చేసేందుకు ప్రధాన ఉద్దేశంతో మహిళామిత్ర ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈక్రమంలో పోలీసు కమాండ్ కంట్రోల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి డీసీపీ రాజకుమారి హాజరయ్యారు. సైబర్ క్రైం ద్వారా జరిగే మోసాలు, పోలీసు హెల్ప్‌లైన్ 1091, డయల్ 100, పోలీసు వాట్సాప్ నెంబర్ 7328909090 తదితర వాటి గూర్చి వివరించారు. మహిళా మిత్ర సభ్యులకు శక్తి బృందాలు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. నిరంతరం మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అందుకు సంబంధించిన ఫిర్యాదులు, పరిష్కార చర్యలకు సంబంధించి సమీక్షించారు. సమావేశంలో వాసవ్య మహిళా మండలి, మహిళా మిత్ర సభ్యులు, ఫెసిలిటేటర్స్, మహిళా కో-ఆర్డినేటర్‌లు, మహిళా పోలీస్టేషన్ ఏసీపీ కే శ్రీలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

హోంగార్డుల కుటుంబాలకు ఆర్ధిక సాయం

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 17: ఉద్యోగ విరమణ చేసిన, అదేవిధంగా విధుల్లో మరణించిన హోంగార్డు కుటుంబాలకు నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆర్థిక సాయం అందజేశారు. కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు రిటైర్డ్ అయిన వారికి, విధుల్లో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు హోంగార్డులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి వేతనం నుంచి కొంత మొత్తాన్ని కూడబెట్టి ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకోవడం జరుగుతోంది. ఈక్రమంలో రిటైర్డ్ అయిన ఓ హోంగార్డుకు, అదేవిధంగా అనారోగ్యంతో మరణించిన ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు నగదు అందచేశారు. రిటైర్డ్ అయిన పరిసె ఆరోగ్యంకు రూ.4లక్షల చెక్కు, మృతి చెందిన షేక్ యూసఫ్ ఆలికి రూ.4లక్షలు, పుల్లెల్లి వెంకటేశ్వరరావుకు రూ.4లక్షలు, బాలంత్రపు రాజుకు మరో రూ.4లక్షలు చొప్పున చెక్కులను పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ ద్వారకాతిరుమలరావు చేతుల మీదుగా బుధవారం వారి కుటుంబాలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కోటేశ్వరరావు, హోంగార్డు ఏసీపీ ఐ మోహన్‌కుమార్, హోంగార్డు ఆర్‌ఐ, తదితరులు పాల్గొన్నారు.

రన్ ఫర్ జీసస్‌ను జయప్రదం చేయండి
*బాప్టిస్ట్ సంఘాల ఐక్య వేదిక పిలుపు
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 17: ఈ నెల 20న శనివారం ఉదయం ఐదున్నర గంటలకు జరిగే రన్ ఫర్ జీసస్ (ఏసు కొరకు పరుగు) కార్యక్రమంలో నగర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని బాప్టిస్ట్ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈమేరకు బుధవారం ఉదయం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆవరణలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, ఈస్టర్ వేడుకల్లో భాగంగా శిలువ వేయబడిన క్రీస్తును ఆరాధించే క్రమంలో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కుల,మత వర్గాలకు అతీతంగా నగర ప్రజలందరూ పాల్గొని క్రీస్తు కృపకు పాత్రులు కావాలని కోరారు. మాజీ డెప్యూటీ మేయర్ సిరిపురపు గ్రిటన్ మాట్లాడుతూ మృత్యుంజయుడైన ఏసుక్రీస్తుపై విశ్వాసపటిమను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఉదయం 5.30 గంటలకు నగరంలోని బిషప్ హజరయ్య స్కూల్ నుంచి ప్రారంభమై శిఖామణి సెంటర్, విశాలాంధ్ర రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా సాంబమూర్తిరోడ్డులోని లూథరన్ చర్చి గ్రౌండ్ వరకు సాగుతుందన్నారు. శాంతి, సామరస్యం చాటడమే కాకుండా మానవుల పాప విమోచనకై శిలువలో మరణించిన యేసుక్రీస్తు 3వ రోజున పునరుద్థానమైన సువార్తను చాటేందుకు గాను నగరంలోనే కాక మరో 3 రాష్ట్రాలలో కూడా రన్ ఫర్ జీసస్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో రెవరెండ్ వై జాన్ వెస్లీ, విశ్వనాథపల్లి బాబ్జి, విశ్వనాథపల్లి జవహర్, ఏ రాజేంద్రప్రసాద్, కనికెళ్లి జ్ఞానసుందరరావు, కొడాలి వంశీ, తదితరులు పాల్గొన్నారు.