విజయవాడ

ఊపందుకున్న ధాన్యం సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: రైతుల సందడితో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఊపందుకుందని నేటి వరకు సుమారు 39వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై శనివారం పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ నగరంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తానన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు జిల్లాలో ఈ రబీ కాలంలో 27,612 హెక్టార్లలో రైతులు వరి నాట్లు వేయగా 2,01,422 మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అంచనాకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 171 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. నేటి వరకు 4500 మంది రైతులు నుండి రూ. 58కోట్ల విలువైన 39వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించామన్నారు. ప్రారంభంలో 67 కొనుగోలు కేంద్రాలు ద్వారా ప్రారంభించి నేడు 81 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను వేగవంతం చేశామన్నారు. రానున్న రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 171 కొనుగోలు కేంద్రాలకు ప్రారంభించనున్నామన్నారు. కొనుగోలుపై పౌర సరఫరాలు, రెవెన్యూ, డీఆర్‌డీఏ శాఖలకు చెందిన అధికారులతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నామన్నారు. జిల్లాలో విజయవాడ రూరల్, జగ్గయ్యపేట, మండలాలతోపాటు రైతులు ఎక్కువుగా పంట వేసిన వ్యవసాయ కేత్రాలకు దగ్గరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ నాగేశ్వరరావు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు పిన్నమనేని వీరయ్య, మెహర్‌బాబా, ఈశ్వరరాజు, శ్రీనివాసబాబు, తదితరులు పాల్గొన్నారు.