విజయవాడ

జయహో జీసస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: క్రీస్తును స్తుతిస్తూ శనివారం ఉదయం విజయవాడ బిషప్ హజరయ్య స్కూల్ ప్రాంగణం నుంచి రన్ ఫర్ జీసస్ (ఏసు కోసం పరుగు) కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. తొలి సంధ్యావేళలో వేలాది మంది క్రైస్తవులు రన్ ఫర్ జీసస్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈస్టర్‌ను పురస్కరించుకుని ఏసుక్రీస్తు రాకను స్వాగతిస్తూ నగరంలోని క్రైస్తవ సంఘాలు, భక్తులు, పాస్టర్ బెల్లంకొండ శివాజీ, సాలూరి జయకుమార్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. మరణాన్ని జయించిన క్రీస్తు జయహో అంటూ శనివారం తొలి సంధ్యావేళ వేలాది మంది క్రైస్తవ విశ్వాసులు పరుగు తీశారు. బిషప్ హజరయ్య స్కూల్ ప్రాంగణం వద్ద ప్రారంభమైన రన్ ఫర్ జీసస్ శిఖామణి సెంటర్, విశాలాంధ్ర రోడ్, చుట్టుగుంట, అల్లూరి సీతారామరాజు బ్రిడ్జి మీదుగా బీఆర్‌టీఎస్ రోడ్, శారదా కళాశాల, సాంబమూర్తి రోడ్డులోని లూథరన్ చర్చి వరకు సాగింది. తొలుత ఈ రన్‌ను రెవ డా. అల్లూరి విశ్వప్రసాద్ ప్రార్థన చేసి శాంతి పావురాలను ఎగురవేసి లాంఛనంగా ప్రారంభించారు. కాగడాలు వెలిగించి కొద్దిదూరం రన్ ఫర్ జీసస్‌లో రెవ డా అల్లూరి విశ్వప్రసాద్, దండల దేవ సహాయం, బిషప్ రక్షణానందం, బిషప్ దయానందం, రెవ శివాజీరాజు, మాజీ డిప్యూటీ మేయర్ ఫిలిప్స్ గ్రిటన్, విజయ విద్యా సంస్థల అధినేత తట్టి అర్జునరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం కాగడాలను పట్టుకుని రన్ ఫర్ జీసస్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణాన్ని జయించిన క్రీస్తు మహిమను తెలియజేసేందుకు ఈ రన్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. మనిషి మృతి చెందిన తరువాత మళ్లీ లేచిరావడం ఉండదని, ప్రజల పాపపరిహారార్థం శిలువ నుంచి రక్తం చిందించి శిలువపై మృతి చెంది 3వ రోజు క్రీస్తు తిరిగి లేచారని వివరించారు. రన్ ఫర్ జీసస్ కో-ఆర్డినేటర్ సాలూరి జయకుమార్ బాబు, మాస్టర్ బెల్లంకొండ శివాజీరాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు మరణించి 3వ దినమున లేచాడు అను సువార్తను పురవీధుల్లో మారుమోగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవ అల్లూరి విశ్వప్రసాద్, దండల దేవసహాయం, బిషప్ రక్షణానందం, బిషప్ దయానందం, బిషప్ శివాజీరాజు, ఫిలిప్స్ సిరిపురపు గ్రిటన్, ఈట్టి అర్జునరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు.