విజయవాడ

రబీ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: రబీ పంట సాగులో రైతు పండించిన చివరి ధాన్యపు బస్తా వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. శనివారం బాపులపాడు మండలం బండిపాలెం, నందిగామ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రబీ పంటలో సుమారు 27,612 హెక్టార్లు సాగు చేయగా ఇందులో 2,01,422 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని రైతులు పండించినట్లు ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వ నిబంధనలు మేరకు కనీస మద్ధతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా కొనుగోలు చేయనున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో 171 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలనే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 81 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాలు ద్వారా నేటి వరకు 2500 మంది రైతుల నుండి రూ. 69 కోట్ల విలువైన 39వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్‌కు రూ.1770, కామన్ వెరైటీకి క్వింటాల్‌కు రూ.1750 ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులను అందుబాటులో ఉంచామని, కొనుగోలు కేంద్రాల్లో అన్ని వౌలిక వసతులు కల్పించామని కలెక్టర్ అన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులను అనుసంధానం చేశామని రైస్ మిల్లర్లు వారికి కేటాయించిన కొనుగోలు కేంద్రాలు నుండి ధాన్యాన్ని తరలించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల పరిశీలనలో కలెక్టర్ ఇంతియాజ్‌తోపాటు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సీహెచ్ రామానుజమ్మ, సంబంధిత మండల తహశీల్దార్లు ఉన్నారు.