విజయవాడ

ప్రశాంతంగా ఎంసెట్ పరీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 20: ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, మెడికల్‌లో కొన్ని విభాగాలకు సంబంధించి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జిల్లాలో శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శనివారం ప్రారంభమైన పరీక్షలు ఈనెల 24వరకు జరగనున్నాయి. పరీక్షలకు నిర్వహణకు గాను జిల్లాలో మొత్తం 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 23వరకు ఇంజనీరింగ్ విభాగంలో 23, 24న అగ్రికల్చరల్, మెడికల్ కోర్సు విభాగాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రెండేళ్లుగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలు తొలిరోజైన శనివారం ఉదయం నిర్వహించిన పరీక్షకు 4,173 మంది విద్యార్థులకు గాను 3,973 మంది హాజరయ్యారు. హాజరు శాతం 95.21గా నమోదైంది. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 4,155 మంది విద్యార్థులకు గాను 3,974 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 95.64గా నమోదైంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం మంచినీటి వసతి కల్పించారు. అలాగే ప్రాథమిక చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు చేసిన హెచ్చరికలతో విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.