విజయవాడ

ప్రశాంతంగా పంచాయతీ కార్యదర్శి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: ఆంధ్రప్రదేశ్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో 1051 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 4) పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1320 కేంద్రాల్లో ఆదివారం జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ ఎంతో ప్రశాంతంగా జరిగింది. కమిషన్ చైర్మన్ ఉదయభాస్కర్ క్షణం క్షణం పరీక్షా ఏర్పాట్లును తనదైన శైలిలో ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,95,526 మంది దరఖాస్తుదారుల్లో 3,89,014 మంది హాల్ టిక్కెట్లు తీసుకోగా వారిలో 2,94,966 మంది (75.82 శాతం) హాజరయ్యారు. ఇక కృష్ణా జిల్లాలో 65 కేంద్రాల్లో కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా పర్యవేక్షించారు. 30,523 మంది అభ్యర్థులకుగాను 15,617 మంది హాజరుకాగా, 14,906 మంది గైర్హాజరయ్యారు. అంటే 51.16 శాతం మంది మాత్రమే హాజరయ్యారు.

నిరంతరం ప్రజలతోనే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
* ఫ్లోర్‌లీడర్ బాలసుబ్రహ్మణ్యం
విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 21: నిరంతరం ప్రజలతోనే ఉండి అన్ని వర్గాల వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వలనే పీడీఎఫ్ శాసనమండలి సభ్యుల ఘనవిజయం సాధ్యమయిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఫ్లోర్‌లీడర్ వీ బాల సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీల అభినందన జరిగింది. ఈకార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వివిధ సమస్యలపై చేస్తున్న పోరాటానికి మద్దతుగా శాసనమండలిలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. పీ డీఎఫ్ ఎమ్మెల్సీల విజయం ఉద్యమాల విజయమని, నీతి నిజాయితీలతో పా టు నిబద్ధతతో కృషి చేయడం పీడీఎఫ్ ఎమ్మెల్సీల ప్రత్యేకత అన్నారు. కాంట్రా క్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద, సీపీఎస్ విధానం రద్దు మీద సంఘాల పోరాటాలకు మద్దతుగా పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరుజిల్లాల గ్రాడ్యుమేట్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ భవిష్యత్‌లో సీపీఎస్ రద్దుకోసం. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రైవేట్ ఉపాధ్యాయులకు రక్షణకోసం, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే దానికోసం కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీ బాబురెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.