విజయవాడ

మండుటెండలో గ్యాంగ్‌మెన్ల కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, ఏప్రిల్ 21: సహజంగా మండుటెండలో మిట్ట మధ్యాహ్నం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా అన్న సమయంలో రైల్ గేటు పడితే సగటు సామాన్యుడికి ఎంతగా చిరాకు పుడుతుందో దాదాపుగా ప్రతి ఒక్కరికీ అనుభవపూర్వకమే..! కేవలం 5,10 నిముషాలు ఎండలో ఆగలేక అసహనం వ్యక్తం చేసే మనకు అదే రైల్వే ట్రాక్‌పై మండుటెండలో 8గంటల పాటు చమటలు కక్కుతూ వీరు పడే అవస్థలు వర్ణనాతీతంగా ఉంటుంది. విజయవాడ డివిజన్ పరిధిలో సుమారు 8వేల మంది వరకు గ్యాంగ్‌మెన్లు పనిచేస్తున్నారు. వీరికి వేసవి కాలం వచ్చిందంటే ప్రత్యేక్ష నరకం కనిపిస్తుంది. రైలు పట్టాల పక్కన భోజనం చేసేందుకు నీడను వెతుక్కోవాల్సిన దుస్థితి. సహజంగానే గ్యాంగ్‌మెన్లు అంటే ట్రాక్‌పై డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఉదయానే్న తన స్టేషన్ దగ్గర మస్తర్ వేయించుకుని అక్కడ నుండి మేస్ర్తిలు చెప్పిన చోటకు ట్రాక్‌పై నడుస్తూ వెళ్లాలి. సుమారు 2కిలోమీటర్లు ట్రాక్‌పై వెళ్లి అక్కడ ట్రాక్ పనులు చేసుకుని, తమ వెంట తెచ్చుకున్న భోజనం అదే పట్టాల పక్కన నీడ వెతుక్కుని, నీడ దొరకని పక్షంలో మండుటెండలోనే భోజనం చేస్తుంటారు. ఇటువంటి దృశ్యాలు వేసవి కాలంలో తరచుగా కనబడుతుంటాయి. ఏప్రిల్, మే సమయాల్లో ఎండల వేడిమి మరింత గణనీయంగా ఉంటుంది. ఈక్రమంలో గ్యాంగ్‌మెన్లు నీరసించి, వడదెబ్బ తాకిడికి కూడా గురవుతుంటారు. ఎంత కష్టమైనా గ్యాంగ్ మెన్లు తమకు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేసి రావాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రత గురించి నిత్యం పని చేసే గ్యాంగ్ మెన్లకు మాత్రం ఆరోగ్య భద్రత ఉండదు. కనీసం ఎండల్లో కష్టించి పనిచేసే వీరికి ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించే ఓఆర్‌ఎస్ పౌడర్లు, టోపీలు, మాస్క్‌లు వంటివి కూడా వీరికి లభ్యం కాని పరిస్థితి ఉంది. కనీసం మంచినీరు కూడా అధికారులు అందించకపోవడంతో ఎవరికి వారు తమ వెంటే నీటిని తీసుకువెళ్లాల్సిన స్థితి. అవి కూడా ఎండకు వెడెక్కి మరేదారి లేని స్థితిలో ఆ వేడి నీటినే సేవించాల్సి వస్తుంది. పగటి పరిస్థితి ఈ విధంగా రాత్రుళ్లు మరోవిధమైన సమస్యల్ని వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రాక్‌పై ఒక్కడే నైట్ పెట్రోలింగ్‌కు వెళ్లే వ్యక్తిపై బ్లేడ్ బ్యాచ్‌లు దాడులు చేయడం, పట్టాలపై సంచరించే పాములు, ఇతర క్రిమి కీటకాల వల్ల భయం భయంగా డ్యూటీ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం డీఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించిన పీ శ్రీనివాస్ గ్యాంగ్ మెన్ల కష్టాలపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.