విజయవాడ

కౌంటింగ్ ప్రక్రియకు అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 18: ఈ నెల 23న జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పోటీలోని అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహకరించి లెక్కింపు సజావుగా జరిగేలా చూడాలని సెంట్రల్ రిటర్నింగ్ అఫీసర్, వీఎంసీ కమిషనర్ ఎం రామారావు పేర్కొన్నారు. ఈమేరకు శనివారం సెంట్రల్ నియోజకవర్గ వివిధ పార్టీల పోటీ అభ్యర్థులు, వారి ఏజెంట్లతో వీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ రామారావు మాట్లాడుతూ ధనేకుల ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగే లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ నిమిత్తం 12 టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిమిత్తం ఒక టేబుల్, వీవీ ప్యాట్ స్లిప్‌ల కౌంటింగ్‌కు ఒక టేబుల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటుకు విడివిడిగా లెక్కింపు జరుగుతుందన్న ఆయన లెక్కింపు సమయంలో సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించమన్నారు. ఏజెంట్లు అందరూ ఆర్‌పీ యాక్ట్ 1951 సెక్షన్ 128 ప్రకారం సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ పాటించడమే కాకుండా సమయవనంతో కౌంటింగ్ సహకరించాలని కోరారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియలో మొదట ఈటీపీబిఎస్ పోస్టల్ బ్యాలెట్ మొదలు పెట్టిన అర్ధగంట తరువాత ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు.కౌంటింగ్ పూర్తయిన తరువాత ఎన్నికల పర్యవేక్షకుని ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 5 వీవీ పాట్‌లను లెక్కిస్తామన్నారు. లాటరీ పద్ధతి ద్వారా 5వీవీ ప్యాట్ మిషన్లను గుర్తిస్తామన్నారు. ఈ ప్రక్రియపై అభ్యర్థులు, వారి ఏజెంట్లు పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సిటీ ప్లానర్ ఏ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అంబేద్కర్
ప్రతిభా పురస్కారాలు ప్రదానం
పటమట, మే 18: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలు జిల్లాలో ఏడుగురు విద్యార్థులు అందుకోవడం ప్రశంసనీయమని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వశాఖకు చెందిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ సంస్థ ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థుల వారికి ప్రధానం చేసే ప్రతిభా పురస్కారాలను శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, సెంట్రల్ బోర్డు కేంద్రాలలో ఇంటర్మీడియెట్ అభ్యసిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరస్తున్న ఎస్‌టీ, ఎస్‌సీ వర్గాల పిల్లలకు బీఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా చేయూతనిస్తున్నారన్నారు. జిల్లాలో గత విద్యా సంవత్సరంలో ఎస్‌సీ, ఎస్‌టీ హాస్టళ్లలో ఇంటర్మీడియెట్ చదివిన విద్యార్థినీ, విద్యార్థులైన ఇమ్మి హర్షిత కల్పన (విజయవాడ తూర్పు) రూ.40వేలు, కూచిపూడి షబనమ్ (పెనమలూరు) రూ.20వేలు, జొన్నకూటి హిమజ (విజయవాడ నార్త్) రూ.50వేలు, మనోగ చంద్రిక మాట్టా (విజయవాడ వెస్ట్) రూ.40 వేలు, పులవర్తి మనీష్ (విసన్నపేట) రూ.40వేలు, బండేటి నాగభారతి (ఇబ్రహీంపట్నం) రూ.50వేలు, వల్లూరి ప్రవల్లిక (ఇబ్రహీంపట్నం) రూ.20వేల నగదుతోపాటు ప్రశంసాపత్రం, కేంద్రప్రభుత్వ సామాజిక న్యాయమంత్రిత్వ శాఖ వారు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం వీరంతా రెండో సంవత్సరం డిగ్రీ చదువుతున్నారని వీరిలో కొంతమంది సివిల్ సర్వీస్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ వెల్ఫేర్ డీడీ ఐఆర్ భార్గవి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ నాయుడు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.