విజయవాడ

టెన్నిస్‌లో నగర క్రీడాకారులకు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 18: ఐటా నేషనల్ ర్యాంకింగ్ టాలెంట్ సీరిస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో నగరానికి చెందిన క్రీడాకారులు పతకాలు కైవసం చేసుకున్నారు. అండర్-16 బాలుర సింగిల్స్ విభాగంలో కే గిరిష్ రన్నరప్‌గా నిలువగా డబుల్స్ విభాగంలో ఎం యుధీర్, ప్రణవ కార్తీక్ జోడీ అండర్-14 విభాగంలో రన్నరప్‌ను కైవసం చేసుకున్నారు. వీరు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈసందర్భంగా క్రీడాకారులను శాప్ స్పోర్ట్స్ ఆఫీసర్ సిరాజుద్దీన్, జిల్లా చీఫ్ కోచ్ ఏ మహేష్‌బాబు, టెన్నిస్ కోచ్ వై శివరామకృష్ణలు అభినందించారు.

దుర్గమ్మ సేవలో మహర్షి
ఇంద్రకీలాద్రి, మే 18: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను శనివారం మధ్యాహ్నం ప్రముఖ సినీ హీరో, సూపర్‌స్టార్ మహేష్ బాబు దర్శనం చేసుకున్నారు. రాజగోపురం వద్ద ఈవో వీ కోటేశ్వరమ్మ సూచనతో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకువెళ్లారు. దర్శనం అనంతరం ఈవో వీ కోటేశ్వరమ్మ మహేష్‌బాబుకు దుర్గమ్మ చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. ఈకార్యక్రమంలో మహేష్‌బాబు వెంట మహర్షి సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాతలు పొట్లూరి వీర ప్రసాద్, చలసాని ఆశ్వనీదత్, దిల్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధి ప్రత్యేక ఉభయదాతలతో కిక్కిరిసిపోయింది. శనివారం కార్తీక పౌర్ణమి తిథి కావటంతో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించుకోవటానికి వీరు తరలి వచ్చారు. దీంతో ఈవో వీ కోటేశ్వరమ్మ ప్రతి కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించి కిందస్థాయి ఉద్యోగులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రత్యేక పూజలకు కలిసి 304 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. లక్షకుంకుమార్చనలో 22, శ్రీ చక్రనామార్చన 40 మంది దంపతులు, చండీహోమంలో 152 మంది దంపతులు, వేకువ జామున నిర్వహించిన ఖడ్గమాల పూజలో 12మంది దంపతులు, రాహుకేతు పూజలో 11, సౌభాగ్య ప్రదాయినిలో 2, నవగ్రహ పూజలో 14మంది, శాంతి కల్యాణంలో 13మంది దంపతులు పాల్గొన్నారు.