విజయవాడ

కాలుష్య నివారణతో ఆరోగ్యవంతమైన సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, మే 18: కాలుష్యాన్ని తగ్గించటం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. శనివారం నగరంలోని ఏలూరు లాకులు, మీసాల రాజారావు బ్రిడ్జి తదితర ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ ఎం రామారావుతో కలసి డ్రైనేజి వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ నేను సైతం కృష్ణమ్మ శుద్ధి కార్యక్రమంలో భాగంగా కృష్ణానది, నగరంలోని ఏలూరు కాల్వ, బందర్ కాల్వల ప్రక్షాళన కార్యక్రమంపై ప్రజలు స్పందన బాగుందని అనేక మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని కలెక్టర్ తెలిపారు. కాల్వల్లో చెత్తా చెదారం, వ్యర్థాలు తొలిగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా ఒక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా మీసాల రాజారావు బ్రిడ్జి సమీపంలోప్రధాన డ్రైనేజిలలో కాలుష్యాన్ని తగ్గించి మరుగునీటిని మంచినీటిగా మార్చే పైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్టును డైబ్రీస్ మైనింగ్ ట్రెజర్స్ (ఓపీసీ) ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుందని ఆయన చెప్పారు. డ్రైన్‌లలో పుల్లీ ఆటోమేటిక్ సీవేజ్ డ్రైన్స్ ఆన్‌లైన్ ప్యూరీఫికేషన్ బై ప్రొడక్ట్స్ మెథడ్స్ మిషన్‌ను డ్రైన్‌లో ఏర్పాటు చేసి కాలుష్యాన్ని తగ్గించేలా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఆరు స్టేజ్‌లలో ఈ మురుగునీరును మంచినీరుగా మార్చే ఈ మిషనరీని పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ పద్ధతి విజయవంతం అయితే దశలవారీగా ప్రధాన కాల్వల్లో కాలుష్యాన్ని తగ్గించేలా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్ధలు సంయుక్తంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రామారావు మాట్లాడుతూ నగరంలో డ్రైన్‌లు ఎప్పటికప్పుడు శుభ్రపరస్తున్నామని, నగరం గుండా ప్రవహించే ప్రధాన కాల్వల్లో కృష్ణమ్మ శుద్ధిసేవలో భాగంగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. కాల్వల్లో ప్లాస్టిక్‌ను, వ్యర్థాలను తొలిగించే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అర్జునరావు, సూపరింటెండెంట్ ఇంజనీరు రామకష్ణ, డెబ్రీస్ ప్రతినిధి సీహెచ్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.