విజయవాడ

ఉదయం 7గంటలకల్లా చెత్త నిల్వలు తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 20: ప్రతిరోజూ ఉదయం 7గంటల లోగా రోడ్ల వెంబడి ఉండే చెత్త నిల్వలను తొలగించిన తరువాత ఇంటింటి చెత్త సేకరణ చేపట్టాలని వీఎంసీ కమిషనర్ ఎం రామారావు ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 8వ డివిజన్ పరిధిలోని పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, గాయత్రీనగర్, అశోక్‌నగర్, పీ అండ్ టీ కాలనీ, పటమటలోని పలు వీధులలో చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆయన సిబ్బందికి సూచనలు చేశారు. 7గంటలు దాటినా రోడ్ల వెంబడి చెత్త ఉండటాన్ని గమనించిన ఆయన సంబంధిత శానిటరీ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో చెత్త తొలగింపు ముఖ్యమని, ఇంటింటి చెత్త సేకరణతో పాటు రోడ్ల వెంబడి చెత్తను కూడా తొలగించడం ముఖ్యమన్నారు. అలాగే ఇంటింటి చెత్త సేకరణలో తడి-పొడి చెత్త సేకరణ విధిగా చేపట్టాలన్నారు. నివాసాల నుంచి వచ్చే చెత్త, ఇతర వ్యర్థాలను వేరువేరుగా సేకరించాలని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా గ్లౌజ్, మాస్క్‌లను ధరించాలని ఆదేశించారు. తదుపరి సైడ్ డ్రైన్ల నిర్వహణను పరిశీలించారు. మురుగు పారుదలకు ఎటువంటి అవరోధాలు లేకుండా సరిచూసుకోవాలన్నారు. పర్యటనలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ అర్జునరావు, హెల్త్ ఆఫీసర్ రామకోటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.