విజయవాడ

కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 20: పెనమలూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు సోమవారం సందర్శించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో రెండు రోజులే గడువు ఉన్నందున బందోబస్తు, భద్రతా చర్యలకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ నెల 23న ఉదయం నుంచే కౌంటింగ్ ప్రారంభం కానుంది. అందుకే ముందురోజు నుంచే భద్రతాపరమైన అంశాలకు సంబంధించి సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన దానిపై సీపీ దృష్టి సారించారు. దీనిలోభాగంగా కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన సీపీ కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కౌంటింగ్ సెంటర్‌కు సమీపంలో ఐదు పార్కింగ్ కేంద్రాలు కేటాయిస్తున్నామని, బందోబస్తు ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ సెంటర్లో కేంద్ర బలగాలు ఉంటాయని, బయట తమ పోలీసులు ఉంటారని తెలిపారు. ముఖ్యంగా కౌంటింగ్ రోజు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమానితులను ఇప్పటికే బైండోవర్ చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు పెంచామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు సీపీ వివరించారు.