విజయవాడ

ఎన్టీఆర్ పురిటిగడ్డలో టీడీపీకి ఘోర పరాజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారక రామారావు పురిటిగడ్డ కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందింది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని వైకాపా సునాయాసంగా కైవసం చేసుకుంది. గతంలో రెండు దఫాలు ఎంపీగా పని చేసిన కొనకళ్ల నారాయణరావుపై వైకాపా అభ్యర్థి, మాజీ ఎంపీ బాలశౌరి 57,581 ఓట్ల ఆథిక్యతతో గెలుపొందగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి పీవీపీతో నువ్వానేనా అన్నట్లు పోరాడుతున్నారు. రాత్రి 10 గంటల సమయానికి కేశినేని నాని ఆధిక్యతలో ఉన్నారు. ఇక జిల్లాలోని మొత్తం 16 శాసనసభ స్థానాల్లో టీడీపీకి రెండే రెండు స్థానాలు దక్కాయి. విజయవాడ తూర్పు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 15వేల ఓట్ల ఆధిక్యతతోనూ గన్నవరంలో గద్దె సన్నిహితుడు వల్లభనేని వంశీ 800 ఓట్ల ఆధిక్యతతోను గెలుపొందారు. వాస్తవానికి పార్టీ కంటే తమ సొంత ఇమేజ్‌తోనే వీరువురూ గెలిచారు. తూర్పులో మల్లాది విష్ణు కేవలం 15 ఓట్లతో గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కృష్ణాలో గతంలో ముందెన్నడూ కూడా ఇంత దారుణంగా పరాజయం చెందలేదు. 1983 తెలుగుదేశం ప్రభంజనంలో కాంగ్రెస్‌కు మూడు సీట్లు లభించాయి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీకి కేవలం రెండు సీట్లు లభించడం పార్టీ శ్రేణులకు బాధకరమే. 1989 కాంగ్రెస్ ప్రభంజనంలో సైతం టీడీపీకి అవనిగడ్డ, తిరువూరు, జగ్గయ్యపేట స్థానాలు, 2004 వైఎస్ ప్రభంజనంలో గుడివాడ, నందిగామ, 2009లో ఆరు స్థానాలు లభించాయి. ఇక మంత్రి పదవి కోసం వైకాపా నుంచి గెలిచిన 15మంది సభ్యుల్లో అప్పుడే పోటీ నెలకొంది. వీరిలో కేపీ సారథి, గతంలో ఐదేళ్లపాటు మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం మూడో సారి గెలిచారు. అలాగే ఉదయభాను మూడోసారి గెలిచారు. ఇక మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, రక్షణనిధి, పేర్నినాని, జోగి రమేష్, రెండో సారి గెలిచారు. వీరిలో విష్ణు గతంలో ఉడా చైర్మన్‌గా, ఉదయభాను ప్రభుత్వ విప్‌గా వ్యవహరించారు. కొడాలి నాని 2004 నుంచి వరుసగా నాలుగోసారి గెలిచారు. తెలుగుదేశం తరపున రెండు సార్లు, వైకాపా తరపున రెండు సార్లు గెలిచారు. ఇక తొలిసారిగా గెలుపొందిన వారు కేవలం నల్గురే ఉన్నారు. ఇక మేకప్రతాప్ అప్పారావు మూడు సార్లు గెలిచి ఉన్నారు. వీరిలో ఎవరికి, ఎంత మందికి మంత్రి పదవులు దక్కుతాయో వేచి చూడాల్సిందే.