విజయవాడ

కొనసాగిన సెంటిమెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేతల పాదయాత్రలకు ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంది. రాష్టమ్రంతటా పాదయాత్ర పేరుతో పర్యటించిన నేతలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారన్న సెంటిమెంట్ మరోసారి నిజమైంది. 2003లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టారు. దాదాపు 1467 కిలోమీటర్ల పాదయాత్రను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు. తరువాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. 2012లో అక్టోబర్ 2న హిందూపురం నుంచి అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర ప్రారంభించారు. వస్తున్నా.. మీ కోసం అంటూ సాగిన ఈ పాదయాత్ర 2014 ఏప్రిల్‌లో విశాఖలో ముగిసింది. దాదాపు 208 రోజుల పాటు 2817 కిలోమీటర్లు నడిచారు. తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటంతో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తరువాతి కాలంలో తండ్రి వైఎస్‌ను అనుసరించి, వైకాపా అధినేత జగన్ కూడా ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఇచ్ఛాపురం వరకూ సాగింది. 3648 కిలోమీటర్ల మేర 341 రోజుల పాటు యాత్ర నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా భారీ విజయం సాధించడంతో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీంతో పాదయాత్రతో పవర్లోకి రావచ్చన్న సెంటిమెంట్ మరోసారి నిజమయిందని చెప్పవచ్చు.

నిర్మానుషంగా చంద్రబాబు నివానం
తాడేపల్లి, మే 23: ఎప్పుడూ పార్టీ శ్రేణులతో కళకళలాడే చంద్రబాబు నాయుడి నివాసం ఓట్ల లెక్కింపు రోజు వెలవెలబోయింది. నిత్యం కార్ల రాకపోకలు, సందర్శకుల హడావుడితో సందడిగా ఉండే ప్రజావేదిక మూగబోయింది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు రోజు మొదటి నుండే ఆధిక్యంలో వెనుక బడటంతో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు వస్తారని భావించి ఏర్పాట్లు చేసిన భద్రతా సిబ్బంది మినహా సీఎం నివాసం వద్ద గురువారం ఎవరూ కనపడక పోవడం విశేషం.