విజయవాడ

‘సెంట్రల్’ బాదుషా విష్ణు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 23: సెంట్రల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అందరికీ ఊపరి సలపని ఉత్కం ఠ నెలకొంది. చివరికి వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణువర్ధన్ విజేతగా నిలిచారు. లెక్కింపు ప్రారంభమైన మొదటి 10 రౌండ్ల వరకూ విష్ణు ఆధిక్యత చూపా రు. తరువాతి రౌండ్లలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు విష్ణు మె జార్టీని బద్దలు కొడుతూ చివరివరకూ తన ఆధిక్యాన్ని చాటారు. చివరి 3 రౌం డ్లలో మళ్లీ వైసీపీ మెజార్టీ పుంజుకుని 66 ఓట్లతో విష్ణు విజయం సాధించడం విశేషం. తొలుత 15ఓట్లకే పరిమితమైన వైసీపీ మెజార్టీ టీడీపీ రీకౌంటింగ్‌కు పట్టుపట్టడంతో జరిపిన కౌంటింగ్‌లో 66ఓట్లకు చేరినట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి 10 గంటల వరకూ సాగింది. చివరి లెక్కిం పు మరింత ఉత్కంఠగా సాగడంతో ఇ టు కౌంటింగ్ గదిలోనే కాక సెంట్రల్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో కూడా రెండు పార్టీల శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. టీడీపీ, వైకా పా పోటాపోటీగా ఓట్లు సాధించగా, జనసేన బలపర్చిన సీపీఎం అభ్యర్థి సీహెచ్ బాబూరావు సెంట్రల్‌లో తన పట్టును నిరూపించుకున్నారు. ఇదిలావుండగా ఓట్ల కౌంటింగ్‌లో 2 ఈవీఎంలు మొరాయించడంతో వాటిని పక్కనపెట్టి మిగిలిన ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తరువాత ఇంజినీర్లతో వాటిని సరిచేయించారు. ఈవీఎం ఓట్ల లెక్కింపునకు మారుగా వీవీప్యాట్ స్లిప్పును లెక్కించడంతో సమస్యకు పరిష్కారం లభించడం గమనార్హం. ఈనేపథ్యంలో సుమారు రెండు గంటలు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మూడు ప్రధాన పార్టీల ఏజెంట్ల సమన్వయంతో లెక్కింపు చేపట్టడం, అధికారుల సూచనలతో వారు ఏకీభవించడంతో మెజార్టీ ప్రకటనకు మార్గం సుగమమైంది. విజయవాడ పార్లమెంట్ సీటు పరిధిలోని సెంట్రల్ నియోజకవర్గం కౌంటింగ్ మాత్రమే సాంకేతిక సమస్యతో ఉత్కంఠగా సాగింది. ఓట్ల పోలైన సరళి పరిశీలిస్తే మొదటి రౌండ్‌లో వైసీపీకి 4570, టీడీపీ 4111, సీపీఎం 2439 సాధించగా, 2వ రౌండ్‌లో వైసీపీ 1227, టీడీపీ 3603, సీపీఎం 1422, 3వ రౌండ్‌లో వైసీపీ 4079, టీడీపీ 3001, సీపీఎంకు 1722, 4వ రౌండ్‌లో వైసీపీ 4103, టీడీపీ 3889, సీపీఎం 2156 సాధించగా, మొత్తం కౌంటింగ్ అయిన ఓట్లు వైసీపీ 16979, టీడీపీ 14604, సీపీఎం 7746 ఓట్లు పోలయ్యాయి. 5వ రౌండ్‌లో వైసీపీ 4491, టీడీపీ 4064, సీపీఎం 2156, 6వ రౌండ్‌లో వైసీపీ 4491, టీడీపీ 3394, సీపీఎం 2030, 7వ రౌండ్‌లో వైసీపీ 4065, టీడీపీ 3394, సీపీఎం 1712, 8వ రౌండ్‌లో వైసీపీ 4120, టీడీపీ 3113, సీపీఎం 1677, 9వ రౌండ్‌లో వైసీపీ 4458, టీడీపీ 4109, సీపీఎం 1598, 10వ రౌండ్‌లో వైసీపీ 3298, టీడీపీ 4544, సీపీఎం 1130, 11వ రౌండ్‌లో వైసీపీ 2018, టీడీపీ 3135, సీపీఎం 695, 12వ రౌండ్‌లో వైసీపీ 3433, టీడీపీ 4226, సీపీఎం 1476, 13వ రౌండ్‌లో వైసీపీ 3203, టీడీపీ 3771, సీపీఎం 1704, 14వ రౌండ్‌లో వైసీపీ 2335, టీడీపీ 3316, సీపీఎం 945, 15వ రౌండ్‌లో వైసీపీ 2121, టీడీపీ 2879, సీపీఎం 1008, 16వ రౌండ్‌లో వైసీపీ 2759, టీడీపీ 3297, సీపీఎం 1382, 17వ రౌండ్‌లో వైసీపీ 2408, టీడీపీ 3461 సాధిస్తే 17వ రౌండ్ పూర్తయ్యేసరికి ఓట్లను పరిశీలిస్తే వైసీపీ 60వేల 175, టీడీపీ 64వేల 834, సీపీఎం 25వేల 620 ఓట్లను సాధించాయి. ఉదయం నుంచి రాత్రివరకూ ఎదురుచూసిన కౌంటింగ్ ఫలితాలు రాత్రి పదిన్నర గంటలకు స్పష్టమైన సమాచారం రావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇదిలావుండగా 18, 19, 20 రౌండ్ల లెక్కింపు ఫలితాల ప్రకటన కొంతసేపు ఆలస్యం కావడంతో ఈలోగా సోషల్ మీడియాలోనే కాకుండా టీవీ చానల్స్‌లో కూడా టీడీపీ అభ్యర్థి ఉమా 130ఓట్లతో గెలుపొందినట్టు ప్రకటనలు చేయడంతో ఒక దశలో టీడీపీ శ్రేణులు కూడా టపాసులతో సంబరాలు చేసుకున్నారు.