విజయవాడ

విజయవాడను వీడను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: తాను అతి తక్కువ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ ఏడు శాసనసభ నియోజకవర్గాల ప్రజలు తనను విశ్వసించి ఓటు వేశారని వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్ (పీవీపీ) అన్నారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాను ఓడినప్పటికీ విజయవాడ వాసిగా నగరాన్ని వీడబోనని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ తాను, తమ పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటామన్నారు. మొదటిరోజే తాను 130 స్థానాల్లో గెలుస్తామని చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదన్నారు. రాజకీయాల్లోకి ఎన్నికలకు కొద్ది ముందుగానే వచ్చానని, కేవలం 19రోజులే పర్యటించానని, అయినా ప్రజలు తనను ఆదరించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. తాను కొంచెం ముందుగా వచ్చి ఉంటే భారీ మెజార్టీతో గెలిచేవాడినన్నారు. ఇక నుంచి విజయవాడ వాసులకు అందుబాటులో ఉంటానని వీరప్రసాద్ వివరించారు.

కృష్ణానదిలో మునిగి
బాలుని మృతి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 25: ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో శనివారం విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలు కృష్ణా నదిలో మునిగిపోయారు. వీరిని చూసినవారు వెంటనే ఒడ్డుకు చేర్చారు. వారిలో షేక్ హనీబాబు(11) అక్కడికక్కడే మరణించాడు. మరో బాలుడు షేక్ కరీముల్లా(10) నిమ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అర్హులైన రైతులకు రుణ అర్హత కార్డులు
* అధికారులకు జేసీ కృతికా శుక్లా ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 25: అర్హత కలిగి ఉన్న ప్రతి రైతుకు రుణ అర్హత కార్డు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుండి శనివారం ఆమె రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లతో రుణ అర్హత కార్డుల మంజూరుపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసేలా ఇప్పటి నుండే రైతుల్లో అవగాహన కల్పంచాలన్నారు. ఈ నెల 29 నుండి జూన్ 7 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, ఎంపీడీవోలు, రైతుమిత్ర గ్రూప్‌లతో గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతులను గుర్తించాలన్నారు. వారికి రుణ అర్హత కార్డులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రుతుపవనాలు ఆరంభమై తొలకరి జల్లులు కురిసి రైతులు పంటలను వేసే సమయానికి రుణ అర్హత కార్డులను అందిస్తే వారు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌లో ఏ రైతు నుండి రుణ అర్హత కార్డు మంజూరు కాలేదని, బ్యాంకుల నుండి రుణాలు అందలేదనే ఫిర్యాదులు రానీయకుండా ఇప్పటి నుండే ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలని జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

చంద్రబాబును కలిసిన మేయర్ శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), మే 25: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ కలిసి పలు అంశాలపై చర్చించారు. శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్ళిన శ్రీ్ధర్ గత ఐదేళ్లుగా నగరాభివృద్ధికి చేసిన కృషి, అందించిన సహాయ సహకారాలకు గాను చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని నగరంగా గుర్తించడమే కాకుండా అందుకనుగుణంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో వందలాది కోట్ల రూపాయలు విడుదల చేసి రోడ్లు, నగర సుందరీకరణ చేశారని గుర్తుచేశారు. 2016లో జరిగిన కృష్ణా పుష్కరాల నిర్వహణకు కోట్ల రూపాయలు మంజూరు చేసి దిగ్విజయంగా పూర్తిచేయడంలో చంద్రబాబు కృషి రాష్ట్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మాజీ ఫ్లోర్ లీడర్లు ఎరుబోతు రమణారావు, కొట్టేటి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

కేశినేని నానికి మేయర్ శ్రీ్ధర్ అభినందనలు
విజయవాడ (కార్పొరేషన్), మే 25: విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా రెండోసారి విజయం సాధించిన కేశినేని శ్రీనివాస్ (నాని)కు మేయర్ కోనేరు శ్రీ్ధర్ అభినందనలు తెలిపారు. ఐదేళ్ల పాటు ఎంపీగా పనిచేసిన నాని నగరానికి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను తీసుకురావడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన టాటా ట్రస్ట్ వారితో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ప్రజలకు అందించిన విశేష సేవలతోనే కేశినేని రెండోసారి ఎంపీగా గెలుపొందారని మేయర్ కొనియాడారు. రాబోయే ఐదేళ్లలో కూడా నగరాభివృద్ధికి సహకారం అందించాలని నానిని కోరారు. నగరంలో నిర్మిస్తున్న రెండు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నాని కృషి ఫలితమేనని ఆయన స్పష్టం చేశారు.

హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ పశ్చిమ, మే 25: మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలోని శ్రీ హనుమద్దీక్షాపీఠంలో శనివారం నుండి హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి దుర్గాప్రసాద స్వామీజీ వీరాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా లోకకణ్యార్థం నవగ్రహ శాంతి హనుమత్ యాగం ప్రారంభించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ 27 నుంచి హనుమద్దీక్షా విరమణలు ప్రారంభమవుతాయని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుండి పెద్దసంఖ్యలో హనుమద్దీక్షాదారులు తరలివచ్చి ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ అనంతరం పీఠంలో దీక్ష విరమణ చేస్తారన్నారు. 29న హనుమజ్జయంతిని వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో వేలాదిగా భక్తులు పాల్గొని హనుమకృపకు పాత్రులు కావాలని స్వామీజీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్వామీజీతో పాటు హనుమత్ పీఠం కన్వీనర్ రాంపిళ్ల జయప్రకాష్, పీఠం ఉత్తరాధికారి పవననంద స్వామి, పలువురు వేద పండితులు పాల్గొన్నారు. యాగం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.

పంచముఖ ఆంజనేయస్వామికి మామిడి పండ్ల రసంతో అభిషేకం
విజయవాడ పశ్చిమ, మే 25: పాల ఫ్యాక్టరీ సమీపంలోని భీమనవారిపేటలోని శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనన్నామని ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్యశాస్ర్తీ తెలిపారు. ఆలయంలో శనివారం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, హనుమజ్జయంతి రోజు ఈ నెల 29న 11 లీటర్ల మామిడి రసంతో అభిషేకం ఘనంగా నిర్వహిస్తామన్నారు. వైభవంగా జరిగే హనుమజ్జయంతి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని శాస్ర్తీ కోరారు.

ఆ జ్ఞాపకాలన్నీ.. మధురాతి మధురం!
* 35ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయికలో కేరింతలు
విజయవాడ పశ్చిమ, మే 25: ‘కాలం ఎంత త్వరగా కరిగిపోయింది.. ఆనాడు అల్లరి చిల్లరగా తిరిగిన కల్మషం లేని లేతమనసులు.. నేడు ఇంటి బాధ్యతలు, సంతానానికి మార్గదర్శకాలు వివరించడం.. ఆనాడు చదువులే భారం, నేడు సంసార సాగరాన్ని ఈదడం ఇంకా భారం..’ అంటూ బాల్యంలోని మధురిమలను వారంతా నెమరువేసుకున్నారు. 35సంవత్సరాల అనంతరం జరిగిన ఆత్మీయ కలయికలో చిట్టినగర్ టేనరు మెమోరియల్ హైస్కూల్ 1983-84 బ్యాచ్‌కి చెందిన సుమారు 50మంది పూర్వ విద్యార్థులు గాంధీనగర్‌లోని హోటల్ ఐలాపురంలో శనివారం ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ అనుభూతుల కోసం అబుదాబీ, దుబాయ్, చత్తీస్‌గఢ్, చెన్నై, హైదరాబాద్, తదితర ప్రాంతాల నుండి నాటి బాల్య స్నేహితులంతా తరలివచ్చారు. ఎవరెవరు ఏఏ వృత్తుల్లో ఉన్నారు, వారి సంతానం ఏ స్థాయిలో ఉంది వంటి విషయాలను కలబోసుకున్నారు. ఆనాడు పరీక్షల్లో చూసిరాతలు, నేడు జీవిత పరీక్షలో వారివారి తలరాతలు, ఉన్నత శిఖరాలు.. ఇలా ప్రతి విషయాన్నీ మనస్సు విప్పి మాట్లాడుకున్నారు. తమ తల్లిదండ్రులు తమని పెంచిన తీరుతెన్నులను నెమరువేసుకున్నారు. పిల్లలుగా ఉన్నప్పటి, తాము ఈనాడు పిల్లల తల్లిదండ్రులుగా ఉన్నప్పటి జీవనయానం విధానాన్ని ఏకవురు పెట్టుకున్నారు. తమ స్నేహితుల ఎదుగుదల గురించి తెలుసుకుని ఆనందడోలికల్లో తేలియాడారు. ఎంత సమయమో అప్పుడే కలయిక ముగింపా అంటూ నిట్టూరుస్తూ ఎవరిదారిన వారు భారంగా తిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఆర్గనైజర్లుగా వ్యవహరించిన సరిగొండ శ్రీనివాసరావు, కూరాకుల శంకరరావు, అంకాల నాగరాజు, యండూరి సురేష్‌బాబు, చెవుల విజయ, తదితరులకు స్నేహితుల బృందం కృతజ్ఞతలు తెలిపారు.

వాంబే కాలనీ రిజర్వాయర్ నిర్మాణం పూర్తిచేయాలి
అధికారులకు కమిషనర్ రామారావు ఆదేశం
విజయవాడ (కార్పొరేషన్), మే 25: 56వ డివిజన్ వాంబే కాలనీలో నిర్మిస్తున్న మంచినీటి రిజర్వాయర్ పనులను పరిశీలించిన వీఎంసీ కమిషనర్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగర పర్యటనలో భాగంగా శనివారం ఉదయం వాంబే కాలనీలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇంటింటి చెత్త సేకరణ, తడి-పొడి చెత్త విభజనతో పాటు సైడ్ డ్రైన్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. తరువాత రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్ పనులు వేగంగా పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రోజువారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుని అందుకనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. అరండల్‌పేటలోని అంబేద్కర్ భవన్‌లో సుమారు 40లక్షల రూపాయల అంచనాలతో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో జరుగుతున్న సీలింగ్, పార్టీషన్, షెడ్, తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. నాణ్యతాలోపాలు లేకుండా నిర్మాణ పనులను త్వరితంగా పూర్తిచేయాలని ఆదేశించారు. పర్యటనలో ఈఈ ప్రభాకర్, జోనల్ కమిషనర్ శ్రీ్ధర్, హెల్త్ ఆఫీసర్ మధుసూదనప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి
విస్తృత ఏర్పాట్లు

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 25: రాష్ట్ర విభజన అనంతరం రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 30న నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో శనివారం సాయంత్రం ఇందిరా గాంధీ స్టేడియంను పలు శాఖల అధికారులు సందర్శించారు. జీఏడీ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, పోలీస్ ఉన్నతాధికారులు గౌతమ్ సవాంగ్, ద్వారకాతిరుమలరావు, సమాచార శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రామారావు, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. స్టేడియంలో గ్యాలరీతో పాటు కూర్చోడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే అతిథులకు ఐదు కేటగిరిల్లో పాస్‌లు ఇవ్వనున్నారు. పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టేడియంకు దగ్గరలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్, బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లను పరిశీలిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని ప్రాంగణంలో కూలర్లు, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ఉంచనున్నారు. స్టేడియంలోని వివిధ క్రీడా సంఘాల కార్యాలయాలను రెండు రోజుల ముందుగానే తమ ఆధీనంలోకి సీఎం సెక్యూరిటీ విభాగం తీసుకోనుంది.

బైక్‌పై బోడే!
ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు

విజయవాడ, మే 25: పెనమలూరు నియోజకవర్గంలో ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శనివారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిల్‌పై తిరుగుతూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా కాలువగట్లపై నివాసం ఉంటున్న వారి ఇళ్ల ముందు బైక్‌పై తిరుగుతూ తనకు ఓటు వేసినవాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఓటు వేసిన వాళ్లకు కృతజ్ఞతలు.. నేనైతే ఏ తప్పూ చేయలేదమ్మా.. ఒక వేళ తెలియక ఏదైనా తప్పు చేసిఉంటే క్షమించండి.. అంటూ ప్రజలను వేడుకుంటూ ముందుకు సాగిపోయారు.

తాగునీటికి ఇబ్బంది రానీయొద్దు
* అధికారులకు కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశం
పటమట, మే 25: జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన ఆర్‌డబ్ల్యూఎస్, జలవనరులు, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో తాగునీటిపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నందున భూగర్భజల మట్టాల స్థాయి పడిపోతుందని, కనుక అధికారులు ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని 50 నివాస ప్రాంతాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. అందుబాటులో వున్న తాగునీటి వనరులపై అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్లతో మండల స్థాయి కమిటీలు ఎప్పటికప్పుడు స్థానిక తాగునీటి అవసరాలపై సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. గుడివాడ, మచిలీపట్నం, పెడన మున్సిపాలిటీలలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. నైరుతీ రుతుప