విజయవాడ

మేజర్ అవుట్‌ఫాల్ డ్రైన్‌లో పూడిక తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 26: నగరంలోని మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్‌లో మురుగు పారుదలకు అవరోధాలు లేకుండా పూడికలను తొలగించాలని వీఎంసీ కమిషనర్ ఎం రామారావు పేర్కొన్నారు. నగర పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం 30, 31, 39వ డివిజన్లలో పర్యటించిన ఆయన తొలుత చనుమోలు వెంకట్రావ్ బ్రిడ్జి దిగువన గల మేజర్ డ్రైన్‌ను పరిశీలించారు. డ్రైన్‌లో చెత్త చెదారం, ఇతర వ్య ర్థాలతోపాటు పూడిక కూడా పెద్ద ఎత్తు న ఉన్న వైనాన్ని వీక్షించిన కమిషనర్ తక్షణమే వాటిని తొలగించే చర్యలు చేపట్టి సక్రమ మురుగు పారుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా చెత్త, ఇతర వ్యర్థాలు డ్రైన్‌లో వేయకుండా తగు నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేటి రోడ్డులో డ్రైన్‌లో పలువురు వ్యాపారులు తమ చెత్త, ఇతర వ్యర్థాలను పడవేస్తున్న వైనాన్ని గుర్తించిన ఆయన అ ట్టివారిపై ప్రజారోగ్య చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. 39వ డివిజన్‌లోని జండా వీధిలోని హిందూ హైస్కూల్ నుంచి జండా చెట్టు సెంటర్ వరకూ గల మేజర్ డ్రైన్‌లో జేసీబీ ద్వారా ప్లోటింగ్ చెత్త, పూడిక తొలగింపు పనులను పరిశీలించిన ఆయన అధికారులకు సూచనలు చేస్తూ ప్రతి రెండు రోజులకొకసారి మేజర్ డ్రైన్‌లో పూడికను తొలగించాలన్నారు. కొండ ప్రాంత ప్రజలు క్యారీబ్యాగ్‌లలో చెత్త ను ఉంచి కాలువల్లో పడవేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి గ్యాలరీల వద్ద పొదలుగా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, స్టేడియం ఆవరణ మొత్తం పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, స్టేడియం వెనుక భాగంలో డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ పక్కన గల మేజర్ డ్రైన్‌లో జరుగుతున్న పూడిక తొలగింపును సోమవారం మధ్యాహ్నం కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. తొలగించిన పూడికను తక్షణమే తరలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈపర్యటనలో సీఎంహెచ్‌వో డాక్టర్ అర్జునరావు, జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ బీ రాజు, ఇక్బాల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్-1 ప్రిలిమినరీ
పరీక్ష ప్రశాంతం
కలెక్టర్ ఇంతియాజ్
పాయకాపురం, మే 26: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్షను ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా ని ర్వహించామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. ఆదివారం ప్రిలిమినరి పరీక్ష నిర్వహిస్తున్న నగరంలోని బిషప్ హజరయ్య బాలికోన్నత పాఠశాల, మాంటిస్సోరి కళాశాల పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో 7వేల 745 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయ్యారని, వీరి శాతం 46.53గా ఉందని తెలిపారు. మొత్తం 16వేల 644 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 8వేల 897 మంది హాజరుకాలేదని కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.
నేడు మీ కోసం రద్దు
అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా నేడు మచిలీపట్నంలో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేశామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదివారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రాలలో నిర్వహించే మీ కోసం యథావిధిగా జరుగుతుందని, జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నిర్వహించే మీ కోసం కార్యక్రమం రద్దు చేశామని తెలిపారు.

సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యేలుః
పాయకాపురం, మే 26: రాష్ట్ర ము ఖ్యమంత్రిగా జగన్ మోహన్‌రెడ్డి ప్ర మాణ స్వీకారం చేయనున్న సభ స్థలిని మధ్య, పెనమలూరు, పశ్చిమ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కొలుసు పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం ఉ దయం పరిశీలించారు. ఈ సందర్భం గా వీరు మాట్లాడుతూ ప్రజలు భారీ సంఖ్యలో జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎ టువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను కోరారు. ము ఖ్యంగా మంచినీరు, మజ్జిగ వంటివి అందుబాటులో ఉంచాలని కోరారు.

ఈవో దంపతులకు స్వామీజీ ఆశీస్సులు
ఇంద్రకీలాద్రి, మే 26:శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ దంపతులు విశాఖ శ్రీశారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామిజీని దర్శనం చేసుకున్నారు. స్వామి జీ ఈవో వీ కోటేశ్వరమ్మ దంపతులకు దివ్య ఆశీస్సులు అందచేసి దుర్గగుడిని మరింత అభివృద్ధి చేయాలని ఈవోకు సూచించారు.
దుర్గమ్మ సేవలో సీపీ దంపతులు
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ను ఆదివారం నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు సతీసమేతంగా దర్శనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఈవో సూచనతో అర్చకులు వీరికి ఆల య మర్యాదలతో స్వాగతం పలికి అం తరాలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం వీరికి ఆశీర్వాద మండపంలో అర్చకులు దివ్య ఆశీస్సులను అందచేయగా, ఈవో సీపీ దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రత్యేకప్రసాదాలు, అమ్మవారి శేష వస్త్రం అందచేశారు.

ఆర్యవైశ్యులను మంత్రివర్గంలోకి తీసుకోవాలి
విజయవాడ (ఎడ్యుకేషన్), మే 26: నూతనంగా ఏర్పాటు కానున్న క్యాబినెట్‌లో ఆర్యవైశ్యుల్లో ఇద్దరికి అవకాశం కల్పించాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షుడు టీ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. బందరురోడ్డులోని హోటల్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో వైసీపీ, దేశంలో బీజేపీ ఘనవిజ యం సాధించాయని ఈసందర్భంగా జగన్, మోదీకి శుభాకాంక్షలు తెలిపా రు. రాష్ట్రంలో మొత్తం నలుగురు ఆర్యవైశ్యులు శాసనసభకు ఎన్నికయ్యారని, నూతనంగా ఏర్పడనున్న వైసీపీ ప్రభు త్వం నుండి కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), వెల్లంపల్లి శ్రీనివాసరా వు (విజయవాడ పశ్చిమ), అన్నా రాం బాబు (గిద్దలూరు) విజయం సాధించారని వీరిలో ఇద్దరికీ మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జూన్‌లో రెండు రాష్ట్రాల నుండి శాసనసభకు ఎన్నికైన ఆర్యవైశ్యులను సత్కరిస్తామని, ఈకార్యక్రమానికి ఆర్యవైశ్య పితామహులు కే రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. ఈసమావేశంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ నాయకులు సీసీ కేశవరావు, వీ వీకే నరసింహారావు, నాగేశ్వరరావు, వె ంకట శ్రీనివాసరావు, సతీష్‌కుమార్, వెంకటేశ్వర్లు, రోశారావు పాల్గొన్నారు.
వెలంపల్లికి మంత్రి పదవి ఇవ్వాలి
ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తూ ని త్యం ప్రజల్లో ఉంటున్న నాయకుడు వె ల్లంపల్లి శ్రీనివాసరావు అని, ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు సీఏ పెనుగొండ సుబ్బారాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బందరురోడ్డులోని ఓహోటల్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లడుతూ పశ్చిమ ని యోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారదిశగా కృ షి చేసిన వెల్లంపల్లికి నూతన మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని జగన్‌ను కోరారు. ఆర్యవైశ్యుల జనాభా దామా షా ప్రకారం రెండు మంత్రి పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాబోయే ము ఖ్యమంత్రి జగన్‌ను కలిసి న్యాయమైన కోరికలు తెలియజేస్తామన్నారు. ఈసమావేశంలో ఆర్యవైశ్య నాయకులు సత్యనారాయణ, గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

అన్నదాన పథకానికి విరాళం
ఇంద్రకీలాద్రి, మే 26: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో నిత్యం భక్తులకు అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఒక భక్తుడు రూ.లక్ష, 116 విరాళాన్ని ఈవో కోటేశ్వరమ్మకు అందచేశారు. అరండపేటకు చెందిన బీ చంద్రశేఖర్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఇక్కడ భక్తులకు అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకాన్ని స్వయంగా పరిశీలించి ఈనగదు చెల్లించారు. ఈవో ఆదేశాలతో సిబ్బంది వీరికి దుర్గమ్మ దర్శనం చేయించి ప్రసాదాలను అందచేయగా, ఈవో అమ్మవారి చిత్రపటం అందచేశారు.