విజయవాడ

చెస్ క్రీడాకారిణి సాత్వికకు రూ. 10వేలు బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 17: ఉజ్బెకిస్తాన్‌లో ఈ నెల 19నుండి 29వరకు జరగనున్న ఏషియన్ స్కూల్‌గేమ్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న సాత్వికకు ఎస్‌ఆర్‌ఆర్ చెస్ పేరేంట్స్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు రూ.10వేలు నగదు బహుమతిని అందజేశారు. ఈసందర్భంగా సాత్వికను జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి డీ శ్రీహరి, ఎస్‌ఆర్‌ఆర్ చెస్ పేరెంట్స్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డీ వరలక్ష్మి, తదితరులు అభినందించారు.

కబడ్డీ సంఘం కార్యాలయాన్ని
స్వాధీనం చేసుకున్న వీఎంసీ
విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 17: స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యాలయాన్ని విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) స్పోర్ట్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా అసోసియేషన్ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడమేకాక బలప్రదర్శన చేయడంతో వీఎంసీ అధికారులు సోమవారం కబడ్డీ అసోసియేషన్ కార్యాలయాన్ని సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనధికారికంగా క్రీడాకారులు కార్యాలయ రూమ్‌లలో ఉండటంతో ఆగ్రహించిన అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ అసోసియేషన్ ప్రతినిధులు స్పదించలేదు. వీఎంసీ అధికారులు రూమ్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.