విజయవాడ

23న యోగా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 17: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 23న ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించే కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయుష్, రెవెన్యూ, మున్సిపల్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెగా యోగా కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారని, ఉదయం 6గంటలకు ప్రారంభం కానున్న యోగాకు రాష్ట్ర ప్రముఖులు, కార్యదర్శులు, మంత్రులు హాజరుకానున్న దృష్ట్యా ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రధాన వేదిక వెనుక వచ్చే బ్యాక్ డ్రాప్, ఎల్‌ఈడీ స్క్రీన్స్ ద్వారా అందరూ వీక్షించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. 500 మందికి పైగా యోగా చేసే విద్యార్థులు పాల్గొనే వీలున్నందున వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా యోగాకు వీలుగా మ్యాట్‌లు, టీషర్ట్సు అందుబాటులో ఉంచాలని ఆయుష్ శాఖకు చెందిన 300 మెడికల్ విద్యార్థులు, డిఎస్‌డిఓకు చెందిన 60 మంది విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలకు చెందిన 150 మంది యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. యోగాకు హాజరయ్యేవారికి ఆహారం, రవాణా సదుపాయాలు కల్పించాలని అదేశించారు.
ఒలింపిక్ రన్‌కు ఏర్పాట్లు చేయండి
ఈ నెల 23న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఒలింపిక్ రన్ నిర్వహించనున్న దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారని ఈరన్‌లో అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులు ద్రోణాచార్య, అర్జున్ అవార్డు గ్రహీతలు పాల్గొంటారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, సబ్ కలెక్టర్ మిషాసింగ్, జేసీ-2 పీ బాబూరావు, డీటీసీ ఈ మీరా ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి, ఆయుష్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కే ప్రసాదరావు, డీఈఓ ఏంవీ రాజ్యలక్ష్మీ, జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ కే ఝాన్సీలక్ష్మీ, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 17: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 54.61శాతం హాజరు నమోదైంది. తెలుగు పేపర్-1కు 531మంది విద్యార్థులకు 290 మంది విద్యార్థులు హాజరవ్వగా 241 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎంవీ రాజ్యలక్ష్మి తెలిపారు.